Tollywood & Bollywood drug Links:డ్రగ్స్ ఎక్కడ పుడతాయో తెలియదు. ఎవరు తయారుచేస్తారో, ఎవరు సప్లై చేస్తారో తెలియదు. అటు తిరిగి, ఇటు తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరే ఆగిపోతాయ్. ఈ రాకెట్.. ఇక్కడే బ్లాస్ట్ అవుతుంది.
మత్తువదలరా
ఇదంతా చూస్తుంటే చిత్ర పరిశ్రమకు, మత్తు పదార్థాలకు విడదీయరాని బంధం ఉందని అర్థమవుతోంది. అందుకే ఓవరాల్ ఫిల్మ్ ఇండస్ట్రీ డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారినట్లు కనిపిస్తోంది. కత్తి లాంటి సీన్ల వెనుక మత్తు మాయ దాగుందనిపిస్తోంది. అసలేం జరుగుతోంది ఇండస్ట్రీలో?
డ్రగ్స్ ఇష్యూ అంటే చాలు అది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బ్లాస్ట్ అవుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్ పేరేదైనా మత్తు కామనైపోయింది. ఇవన్నీ చూస్తుంటే చిత్ర పరిశ్రమకు మాదకద్రవ్యాలకు విడదీయరాని బంధం.
బాలీవుడ్‌లో డ్రగ్ లింక్స్ దుమారం
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే.. డ్రగ్స్‌కి కేరాఫ్. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన బాలీవుడ్ డ్రగ్స్ డోస్ సుశాంత్ డెత్ కేసు, కంగనా ట్వీట్స్‌తో బజారుకొచ్చిపడింది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో గుట్టుగా సాగిపోయే డ్రగ్ పార్టీల భాగోతం మళ్లీ హాట్ టాపిక్. బాలీవుడ్ పార్టీల్లో కిక్కు వెనకున్న సీక్రెట్‌ని కంగనా బహిరంగంగా చెప్పేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయ్. స్ట్రైస్ ఫీలవడం వల్లే డ్రగ్స్‌కి అలవాటు అవుతున్నారట. చాలా మంది నటీనటులు రెగ్యులర్ షూటింగ్స్, కాల్షీట్లు, బిజీ షెడ్యూల్స్ వల్ల.. బాగా స్ట్రెస్, ప్రెజర్ ఫీలవుతారు. డ్రగ్స్‌ని వాళ్లు స్ట్రెస్ బస్టర్‌గా వాడతారట.
మరికొందరు యాక్టర్స్ , అవకాశాలు రాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారట. అందులో నుంచి బయటపడేందుకు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి కాస్త రిలాక్సేషన్ ఫీలయ్యేందుకు కూడా మత్తుపదార్థాలు వాడతారని చెబుతున్నారు. ఈ క్రమంలో, వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం తర్వాత డ్రగ్స్‌కి బానిసలుగా మారిపోవడం జరుగుతోంది.
సిగరెట్ ప్లేస్‌లో డ్రగ్
ఇదంతా కాయిన్‌కి వన్ సైడ్. ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకునేందుకు కూడా డ్రగ్స్ తీసుకోవాల్సిందేనట. హై ప్రొఫైల్స్‌తో మీటింగ్స్, పరిచయాలు కావాలంటే, వాళ్ల పార్టీలకు హాజరైనప్పుడు.. మాదకద్రవ్యాలు సేవించాల్సిందేనట. ఇండస్ట్రీలో, హవా నడిపిస్తున్న బ్యాచ్‌ని క్యాజువల్‌గా కలిసినా డోస్ పడాల్సిందేనట. బీ టౌన్‌లో ఇదంతా కామన్.
ఆఫర్స్ రావాలన్నా, స్క్రీన్‌పై మెరవాలన్నా ఇండస్ట్రీలో పేరు సంపాదించాలన్నా అవన్నీ డ్రగ్స్‌కే లింక్ అయ్యి ఉంటాయని చెబుతున్నారు. డ్రగ్ లింక్స్‌తో ఏర్పడే ఫ్రెండ్‌షిప్‌తో.. ఇండస్ట్రీలో బాగా బెనిఫిట్స్ ఉంటాయని ఫీలవుతున్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే డ్రగ్స్ కామన్. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో జరిగే పార్టీల్లో డ్రగ్స్ సర్వసాధారణమని ప్రచారం జరుగుతోంది. బీ టౌన్ పార్టీల్లో ఐతే.. కొకైన్ చాలా ఫేవరెట్ అంటూ అనౌన్స్ చేసి కంగనా రనౌత్ ఫుల్ హీట్ పెంచేసింది. అంతేకాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొకైన్ చాలా పాపులర్ డ్రగ్ అని కూడా చెప్పింది.
ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఇంట్లో జరిగే పార్టీలో కొకైన్ కచ్చితంగా ఉంటుందని తెలిపింది. సంపన్నులు, శక్తిమంతమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ కొకైన్ ఫ్రీగానే దొరుకుతుందని ట్వీట్ చేసింది.
డ్రగ్ ఉంటేనే పార్టీ
ఫిల్మ్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు, హీరోలు కొకైన్ కిక్కులో జోగేందుకు బాగా ఇంట్రస్ట్ చూపిస్తారట. పార్టీకి వెళ్లిన వాళ్లంతా ఈ డ్రగ్‌ని ఫ్రీగా తీసుకుంటారట. అంతేకాదు బీ టౌన్ సెలబ్రిటీల పార్టీల్లో డ్రగ్స్ ఒక స్టేటస్ సింబల్.
సుశాంత్ డెత్ కేసు, డ్రగ్ మాఫియాతో, రియా చక్రవర్తి లింకులు బాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. రియా చెప్పిన 25 మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుండటంతో టెంపరేచర్ మరింత పెరిగింది. రకుల్, సారా అలీఖాన్ పేర్లు బయటకు రావడంతో బీ టౌన్‌లో మరికొందరి పల్స్ కూడా పడిపోయినట్లు చెబుతున్నారు.
డ్రగ్స్ లింక్స్ బాలీవుడ్‌ని మాత్రమే కాదు.. టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నాయ్.