Hero Nithiin: కుమారుడి పేరు రివీల్ చేసిన హీరో నితిన్.. ఫ్యూచర్‌లో హీరోకి ఉండాల్సిన పేరే..

షాలిని గత ఏడాది మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి ఫొటోలు, వీడియోలను ఇప్పటివరకు బయటపెట్టలేదు.

Hero Nithiin

టాలీవుడ్ హీరో నితిన్ తన కుమారుడి పేరును రివీల్ చేశాడు. తన కుమారుడికి ‘అవ్యుక్త్’ అని పేరు పెట్టినట్లు తెలిపాడు.

తన భార్య షాలినితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ స్పెషల్ పోస్ట్ చేశాడు నితిన్.

జన్మాష్టమికి తమ హృదయాలు ప్రేమతో నిండిపోయాయని నితిన్, షాలిని పేర్కొన్నారు.

తమ కుమారుడి పేరును చాలా హ్యాపీగా ప్రకటిస్తున్నామని అన్నారు.

అవ్యుక్త్ తమ లైఫ్‌లో ఎప్పటికీ ఓ చిన్ని కృష్ణుడని చెప్పారు.

కాగా, షాలిని గత ఏడాది మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడి ఫొటోలు, వీడియోలను ఇప్పటివరకు బయటపెట్టలేదు. కనీసం ఇప్పుడు కూడా ఆ బాబుకి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేయలేదు.

నితిన్(Hero Nithiin), షాలినిది లవ్‌ మ్యారేజ్. వారి వివాహం 2020లో జరిగింది.

నితిన్ తాజా సినిమా ‘తమ్ముడు’ అంతగా ఆడలేదు. అంతకుముందు రాబిన్ హుడ్ కూడా నిరాశపర్చింది.

అవ్యుక్త్ పేరు అర్థం ఏంటి?

అవ్యుక్త్ అంటే అవ్యక్త్ నుంచి పుట్టిన పదం. తెల్లగా కనబడని, స్పష్టమైన మనస్సు కలవాడు, ఆవిర్భవించని అని అర్థం.

బయటకు రాని రూపం అని కూడా అర్థం ఉంది. అవ్యుక్త్ అంటే స్పష్టంగా వ్యక్తం కానిది, దాగి ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడి మరొక పేరుగా కూడా దీన్ని భావిస్తారు.