Tollywood hero Siddu Jonnalagadda talks about his school love
Siddu Jonnalagadda: లవ్ అనే ఫీలింగ్ ని దాటకుండా ఎవరు ఉండలేరు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒక్కరిపైనా ఆ ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఆ విషయం అవతల వ్యక్తి చెప్పడం, చెప్పకపోవడం అనేది తరువాత సంగతి. కానీ, ఆ భావన మాత్రమ్ కలగడం కామన్. ఇక స్కూల్, కాలేజ్ ప్రేమల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలాగే తన లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీంతో, మన టిల్లు లైఫ్ లో ఉన్న ఆ రాధిక ఎవరో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్.
ఈ విషయం గురించి సిద్దు మాట్లాడుతూ.. నేను కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నాను. 7వ తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డాను. కానీ, ఆ అమ్మాయికి నా ప్రేమ గురించి చెప్పలేదు. పదవ తరగతి కూడా అయిపోయింది. స్కూల్ చివరి రోజు శ్లామ్ బుక్ తీసుకొని ఆమె దగ్గరకు వెళ్లాను. అందులో తన ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ రాసి, ఒక లుక్ ఇచ్చి, సైకిల్ పై వెళ్లిపోయింది. ఆ క్యూట్ విజువల్ ఇంకా క్లియర్ గుర్తుంది. కొన్నేళ్లకు ఆ అమ్మాయికి పెళ్లయి, పిల్లలు కూడా పుట్టారు. నేరుగా మాట్లాడకపోయినా, అప్పుడప్పుడు ఇనస్టాగ్రామ్ లో తన ప్రొఫైల్ చూస్తుంటాను. అలా తనకు పెళ్లయి, పిల్లలున్నారనే విషయం తెలిసింది”అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు. దీంతో ఆయన వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సిద్దు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తెలుసు కదా అనే సినిమా చేస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోన తెరకెక్కిస్తుండగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాక్ లాంటి డిజాస్టర్ తరువాత సిద్దు నుంచి వస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుంది అనేది చూడాలి.