Sai Durga Tej: హెల్మెట్ తప్పకుండా ధరించండి.. వేగం తగ్గించండి.. ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025లో సాయి దుర్గ తేజ్

హైదరాబాద్‌లో ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 జరిగిన విషయం తెలిసిందే. ఎంతో (Sai Durga Tej)ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ హాజరయ్యారు.

Sai Durga Tej: హెల్మెట్ తప్పకుండా ధరించండి.. వేగం తగ్గించండి.. ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025లో సాయి దుర్గ తేజ్

Sai Durga Tej at the Fast & Curious Auto Expo 2025 event

Updated On : October 12, 2025 / 8:51 AM IST

Sai Durga Tej: హైదరాబాద్‌లో ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 జరిగిన విషయం తెలిసిందే. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కి టాలీవుడ్ సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “అవకాశాల కోసం నా ప్రొఫైల్ పట్టుకుని చాలా సినిమా ఆఫీస్‌లకు తిరిగాను. ఆ ఫోటోలను పల్లీలు, బఠానీలు తినడానికి వాడేవారు. ఓ సారి మంచు మనోజ్ గారి ఆఫీస్‌లో దర్శకుడు వైవీఎస్ చౌదరీ గారు నా ఫోటోలు చూసి ‘రేయ్’ సినిమాలో అవకాశం ఇచ్చారు.(Sai Durga Tej) ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ పట్టువదలకుండా ఆ సినిమాను కంప్లీట్ చేశాం. అలాగే పిల్లా నువ్వులేని జీవితం టైంలోనే ఓ ప్రముఖ నటుడు చనిపోయారు. అది జగపతి బాబు గారితో రీ షూట్ చేశాం. అలా ఎన్ని సమస్యలు వచ్చినా నా కలల్ని మాత్రం ఎప్పుడు వదిలి పెట్టలేదు.

Sree Vishnu: 15 మంది హీరోలు రిజెక్ట్ చేస్తే.. శ్రీవిష్ణు ఒప్పుకున్నాడా.. అంతలా ఏముంది ఆ కథలో!

పవన్ కళ్యాణ్ గారు నాకు గురువులాంటి వారు. చిన్నతనం నుంచే ఆయన నన్ను గైడ్ చేస్తున్నారు. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ ఇలా అన్నింట్లోనూ ట్రైనింగ్ ఇప్పించారు. ప్రతీ సిట్యువేషన్‌ను నేను లైటర్ వేలోనే తీసుకుంటాను. నవ్వుతూ ఆ సిట్యువేషన్‌ను దాటేస్తుంటాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా అందరూ అడుగుతూంటే.. కోమాలో కాదు హాస్పిటల్లో చిల్ అవ్వడానికి వెళ్లాను అని చెప్పేవాడిని. అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించండి. దయచేసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, వేగం తగ్గించండి. యాక్సిడెంట్ తరువాత నాకు చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. మాట కూడా సరిగ్గా రాలేదు.

అలాగే, సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ని లింక్ చేయడం మన బాధ్యతగా ఫీలవుతాను. చిరంజీవి గారితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సినిమా చేస్తే చూడాలనేది నా కోరిక. నా గ్యారేజ్‌లో ఉన్న మహేంద్ర థార్, రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అంతకన్నా 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు అంటే చాలా చాలా ఇష్టం. అది నా డ్రీమ్ కార్. ఎప్పటికైనా సరే ఆ కారు కొంటాను” అంటూ చెప్పుకొచ్చాడు సాయి తేజ్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన “సంబరాల ఏటిగట్టు” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.