Tollywood Heroine Chitra Shukla wedding celebrations are started
Chitra Shukla : టాలీవుడ్ హీరోయిన్ చిత్రశుక్లా ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ పెళ్లి సందడి కూడా షురూ అయ్యింది. ఆ పెళ్లి సంబరాలకు సంబంధించిన ఫోటోలను చిత్ర అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఇంతకీ ఆమె చేసుకోబోయేది ఎవర్ని అనుకుంటున్నారు..? సాధారణంగా హీరోయిన్స్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను లేదా బిజినెస్ మెన్స్ ని పెళ్లాడుతుంటారు. కానీ చిత్ర ఒక పోలీస్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. అది కూడా ప్రేమ వివాహం. గత కొంత కాలంగా చిత్ర.. ఆ పోలీస్ తో ప్రేమాయణం కూడా నడుపుతున్నారు.
చిత్రశుక్లా మధ్యప్రదేశ్ కి చెందిన అమ్మాయి. ఆమె ప్రేమించిన పోలీస్ కూడా మధ్యప్రదేశ్ కి చెందిన వ్యక్తే. మధ్యప్రదేశ్ లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా చేస్తున్న వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో చిత్ర గత కొంతకాలంగా క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. అతనితో క్లోజ్ గా ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కూడా వచ్చేవారు. ఇక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతూ కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. డిసెంబరు 8న చిత్ర, వైభవ్ ఏడడుగులు వేయబోతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మెహందీ, సంగీత్, హల్దీ కార్యక్రమాలు మొదలయ్యాయి.
Also read : Abhiram Daggubati : లంకలో అభిరాముడి కళ్యాణం.. బయలుదేరిన దగ్గుబాటి కుటుంబం..
చిత్రశుక్లా సినిమాల విషయానికి వస్తే.. ‘ఛల్ భాగ్’ అనే హిందీ సినిమాలోని ఒక సాంగ్ లో డాన్సర్ గా కనిపించి 2014లో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తరువాత విజయ్ ‘పులి’, రామ్ ‘నేను శైలజ’ సినిమాల్లో కూడా సాంగ్స్ లోనే కనిపించారు. 2016లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘మా అబ్బాయి’ అనే సినిమాలో హీరోయిన్ గా మొదటిసారి నటించారు. ఆ తర్వాత రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేశారు. అయితే ఏ సినిమా ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం అయితే ఈమె చేతిలో ఏ సినిమా లేదనే తెలుస్తుంది.