Raghava Reddy Movie Review : ‘రాఘవ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్‌తో సాగిన కథ..

శివ కంఠమనేని 'రాఘవ రెడ్డి' మూవీ ఆడియన్స్ ని ఎంతలా అలరించింది..?

Tollywood new movie Raghava Reddy story Review full report

Raghava Reddy Movie Review : సంజీవ్ మేగోటి దర్శకత్వంలో శివ కంఠమనేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. రాశి, నందితా శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, అజయ్ ఘోష్.. వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కేఎస్ శంకర్ రావ్, ఆర్ వెంకటేశ్వర్ రావు, జి రాంబాబు యాదవ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో కలిసి మ్యూజిక్ చేశారు. ఈ చిత్రం నేడు జనవరి 5న ఆడియన్స్ ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే..
వైజాగ్ లోని ఓ కాలేజీలో రాఘవ రెడ్డి(శివ కంఠమనేని) క్రిమినాలజీ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. ఇతనికి ఫ్యామిలీ అనేది లేకపోవడంతో.. కాలేజీనే తన కుటుంబంగా, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని తన పిల్లలగా భావించి కాలేజీ స్టూడెంట్స్ అందర్నీ క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. అయితే ఇంతలో ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి మహాలక్ష్మి(నందితా శ్వేతా) వస్తుంది.

మహాలక్ష్మి తన అమ్మ జానకి (రాశి), అమ్మమ్మ (అన్నపూర్ణమ్మ) గారాబంతో అల్లరి పిల్లలా పెరుగుతుంది. అదే అల్లరి కాలేజీలో కూడా చేస్తూ మొత్తం క్రమశిక్షణ చెడగొట్టేలా చేస్తుంది. ఆమె వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా చెడిపోతున్నారని భావించిన రాఘవ రెడ్డి మహాలక్ష్మిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఇంతలో మహాలక్ష్మి మిస్ అవుతుంది. దీంతో మహాలక్ష్మి తల్లి జానకి.. రాఘవ రెడ్డి వల్లే మహాలక్ష్మి మిస్ అయ్యిందని అతన్ని నిందిస్తుంది. దీంతో రాఘవ రెడ్డి, మహాలక్ష్మిని వెతకడానికి రంగంలోకి దిగుతాడు. చివరికి మహాలక్ష్మి దొరికిందా..? అలాగే మహాలక్ష్మి, జానకి, రాఘవ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి..? అసలు రాఘవ రెడ్డి గతం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also read : 1134 Movie Review : ‘1134’ మూవీ రివ్యూ.. ఒకరికి తెలియకుండా ఒకరితో సరికొత్త క్రైం చేయించి..

సినిమా విశ్లేషణ..
ఈ సినిమా కథని సింపుల్ గా చెప్పాలంటే.. వృత్తి బాధ్యతలతో భార్య పిల్లలకు దూరమైన ఓ తండ్రి, మళ్ళీ వారి జీవితంలోకి ఎలా వచ్చాడు అనేది స్టోరీ లైన్. ఈ కథతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అయితే కథ పాతదే అయ్యినప్పటికీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. మొదటి భాగం హీరో ఎలివేషన్స్, కామెడీతో సరదాగా సాగిన కథ.. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్, యాక్షన్ తో సీరియస్ గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా స్క్రీన్ ప్లేని కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు.. మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది. సినిమా కొన్నిచోట్ల స్లోగా సాగుతుంది.

నటీనటులు..
రాఘవ రెడ్డిగా శివ కంఠమనేని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పవర్ ఫుల్ సీన్స్ లో ఆ పాత్రకి తగ్గట్టు అదరగొట్టారు. ఇక రాశి, అన్నపూర్ణమ్మ.. తల్లి అమ్మమ్మ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలారోజుల తరువాత రాశి మరోసారి వెండితెర పై కనిపించి అలరించింది. నందితా శ్వేతా తన పాత్రతో అందర్నీ డామినేట్ చేసిందనే చెప్పాలి. విలన్స్ గా పోసాని, అజయ్ ఘోష్ ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్..
నిర్మాణ విలువలు అన్ని బాగున్నాయి. ముఖ్యంగా కెమెరా వర్క్ ఆకట్టుకుంది. ఇక మ్యూజిక్ లో ఒక పాట మినహాయించి మిగతావి పర్వాలేదు అనిపించాయి. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. దర్శకుడు సంజీవ్ మేగోటి.. కొత్త స్క్రీన్ ప్లేతో ఫ్యామిలీ సెంటిమెంట్ ని బాగానే వర్క్ చేశాడు.

ఓవర్ ఆల్‌గా.. తన కూతురు కోసం ఓ తండ్రి పడే ఆవేదనను, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ని ఎమోషనల్ గా చూపించి మెప్పించారు. ఈ చిత్రానికి 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు