1134 Movie Review : ‘1134’ మూవీ రివ్యూ.. ఒకరికి తెలియకుండా ఒకరితో సరికొత్త క్రైం చేయించి..

థ్రిల్లింగ్, హ్యాకింగ్ సినిమాలకు మంచి ఆసక్తిని చూపిస్తారు ప్రేక్షకులు. అలాంటి కథాంశంతోనే ముందుకొచ్చింది 1134 సినిమా.

1134 Movie Review : ‘1134’ మూవీ రివ్యూ.. ఒకరికి తెలియకుండా ఒకరితో సరికొత్త క్రైం చేయించి..

Heist Thrilling Hacking Concept New Movie 1134 Review and Rating

1134 Movie Review : థ్రిల్లింగ్, హ్యాకింగ్ సినిమాలకు మంచి ఆసక్తిని చూపిస్తారు ప్రేక్షకులు. అలాంటి కథాంశంతోనే ముందుకొచ్చింది 1134 సినిమా. కొత్త దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వంలో కొత్త నటులతో శాన్వీ మీడియా, రాంధుని క్రియేషన్స్ బ్యానర్స్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు జనవరి 5న విడుదల అయింది.

కథ విషయానికొస్తే.. 1134 అనే కథ ఓ ముగ్గురితో మొదలవుతుంది. ఓ వ్యక్తి.. లక్ష్మణ్(ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్)అనే ముగ్గురు యువకుల్ని కిడ్నాప్ చేసి ఊరి చివర ఉన్న ఓ పోలీస్ గెస్ట్ హౌస్ లో పడేస్తాడు. మీకు తెల్లారే వరకే టైం. ఆ తర్వాత మీరు అవుట్ అని చెప్పి వెళ్లిపోవడంతో ఈ ముగ్గురికి ఏం చేయాలో తెలీదు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారని వాళ్ళ కథలని చెప్పుకుంటారు. ఈ ముగ్గురికి డబ్బులు అవసరం వస్తుంది. ఓ వ్యక్తి ఎరిక్ కి డబ్బులు ఇచ్చి ATMలు ఉండే సీసీ కెమెరాలని హ్యాక్ చేసి పని చేయకుండా చేస్తాడు. లక్ష్మణ్ కి బస్టాప్స్ లో ఉండే బ్యాగ్స్ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తాడు. హర్ష్ కి ATM లలో డబ్బులు తీసుకొని రావాలని చెప్తారు. దీంతో వీళ్ళ ముగ్గురి కథలు తెలుసుకొని ఒకరికి తెలియకుండా ఒకరు ఈ ముగ్గురు యువకులు ఒకే వ్యక్తికి పనిచేశారని తెలుస్తుంది. ఈ క్రైమ్ కనపడకూడదు అని వాళ్ళని చంపడానికి ప్లాన్ చేసినట్టు అర్ధం చేసుకుంటారు. దీంతో అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన ఈ ముగ్గురు యువకులు తమతో ఈ క్రైమ్ చేయించి ఎవరు అని తెలుసుకోవడం మొదలుపెడతారు. మరి ఈ ముగ్గురు యువకులతో క్రైమ్ ఎవరు చేయించారు? వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు 1134 నంబర్ కి వీరికి సంబంధం ఏంటి? చివరకు ఈ ముగ్గురు కలిసి అతన్ని పట్టుకున్నారా? అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

సినిమా విశ్లేషణ.. మొదటి హాఫ్ అంతా ముగ్గురు యువకుల్ని కిడ్నాప్ చేయడం, వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళు డబ్బుల కోసం ఎందుకు ఈ పని చేశారు, కిడ్నాప్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది చూపిస్తారు. మొదటి హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా కొంచెం ఆసక్తికరంగా అసాగుతుంది. అసలు వీళ్ళతో క్రైమ్ ఎవరు చేయించారు అని వీళ్ళు చేసే ప్రయత్నం, హ్యాకింగ్, వెతుకులాట కొంచెం ఆసక్తిగా సాగుతుంది. వీళ్ళ వెతుకులాటలో అన్ని 1134 నంబర్ కి కనెక్ట్ అవ్వడం, దాని గురించి వివరించే సీన్ చాలా బాగుంటుంది. చివరకు ఓ వ్యక్తిని పట్టుకోవడంతో కథ అయిపోకుండా చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చి కథని ఇంకొంచెం నడిపిస్తారు. సినిమాలో ఒక్క లేడి పాత్ర కూడా లేకపోవడం విశేషం.

Also Read : Guntur Kaaram : మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా..

నటీనటులు, సాంకేతిక విషయాలు.. అందరూ ఆల్మోస్ట్ కొత్త నటీనటులతోనే సినిమా చేయడం విశేషం. మెయిన్ లీడ్స్ లో చేసిన ముగ్గురు యువకులు బాగా చేశారని చెప్పొచ్చు. వీళ్ళు ముగ్గురు కాకుండా కేవలం కొన్ని పాత్రలే ఉంటాయి. ఆ మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు. సినిమా ఎక్కువ శాతం రాత్రి పూటే ఉండటంతో కెమెరా విజువల్స్ రాత్రిపూట చక్కగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. శాన్వి క్రియేషన్స్, నిర్మాత భరత్ కుమార్ పాలకుర్తి చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు దానికి తగ్గట్టు పెట్టారు. శరత్ కొత్త దర్శకుడు అయినా తక్కువ బడ్జెట్ లో, కేవలం కొన్ని పాత్రలతోనే ఆసక్తిగా తెరకెక్కించాడు.

మొత్తంగా 1134 సినిమా తక్కువ పాత్రలతో సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్. హీస్ట్ క్రైమ్, థ్రిల్లింగ్, హ్యాకింగ్ లాంటి కథలు నచ్చేవారు ఈ సినిమాని థియేటర్స్ లో చూడాల్సిందే. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.