Sankranti Updates : టాలీవుడ్ మూవీస్ సంక్రాంతి అప్డేట్స్.. ఫెస్టివల్ స్పెషల్ ఫొటోషూట్స్..

సంక్రాంతి పండుగ నాడు టాలీవుడ్ మూవీస్ సంక్రాంతి అప్డేట్స్, అలాగే పండుగ సందర్భంగా సినిమా తారల స్పెషల్ ఫొటోషూట్స్..

Tollywood new movies Sankranti Updates and celebrities festival special photoshoots

Sankranti Updates : సంక్రాంతి పండుగతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి కనిపిస్తుంది. ఇక సంక్రాంతి అంటే టాలీవుడ్ లో కూడా సినిమాల సందడి కనిపిస్తుంది. ఒక పక్క థియేటర్స్ లో సినిమాలు, మరో పక్క కొత్త సినిమా అప్డేట్స్ తో టాలీవుడ్ అంతా గ్రాండ్ గా కనిపిస్తుంది. మరి ఈ సంక్రాంతి టాలీవుడ్ అప్డేట్స్ ఏంటో చూసేయండి.

మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠ కలయికలో రాబోతున్న Mega156 టైటిల్ టీజర్ ని నేడు రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ముందు నుంచి అనుకుంటున్నట్లు ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది.

Also read : Chiranjeevi : ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో.. చిరంజీవి రిఫరెన్స్..

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతీ సినిమా అప్డేట్ నేడు వచ్చేసింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రాజా సాబ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. లుంగీలో ప్రభాస్ లుక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘కూర్మనాయకి’ మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న ‘ఫైటర్’ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. వీటితో పాటు మరికొన్ని సినిమాల కొత్త పోస్టర్స్, అలాగే పండుగ సందర్భంగా సినిమా తారల స్పెషల్ ఫొటోషూట్స్ ని కూడా చూసేయండి.

https://youtu.be/BvaDqTWA-Tg