Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు.. కూతురి వివాహ వేడుకకు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
Tollywood producer Bandla Ganesh daughter marriage
Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జానకి వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాబోయే వధూవరుల ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూసి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
Allu Ayaan Birthday: చిన్నీ బాబు బర్త్ డేకి బన్నీ స్పెషల్ విష్.. అల్లు అయాన్ స్పెషల్ ఫొటోస్ వైరల్
అయితే, బండ్ల గణేష్ అల్లుడు కాబోయే ఆ అబ్బాయి ఎవరు? అతని కుటుంబ నేపథ్యం ఏమిటి? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. త్వరలోనే బండ్ల గణేష్ స్వయంగా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
