Tollywood
Tollywood : ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ సినిమా అఖండ 2 రిలీజ్ అర్దాంతరంగా ఆగిపోయింది. నేడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. అఖండ 2 నిర్మాతలపై ఓ వైపు తమిళనాడులో ఈరోస్ సంస్థ 28 కోట్ల నష్టాలు కట్టాలని అప్పటి వరకు సినిమా ఆపాలని ఏకంగా హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. దీంతో అక్కడ రిలీజ్ కి సమస్యలు ఏర్పడ్డాయి.(Tollywood)
అయితే అవి క్లియర్ చేసారు, అక్కడ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అని వార్తలు వచ్చాయి కానీ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు. ఇక ఇక్కడ తెలుగులో అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ గతంలో ఉన్న నష్టాలను భర్తీ చేయాలని అప్పటిదాకా రిలీజ్ చేయబోమని డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఫైన్షియర్స్ కూడా డబ్బులు క్లియర్ చేస్తేనే అఖండ 2 రిలీజ్ అవుతుందని కూర్చున్నారట.
ఇలా ఒకేసారి అన్ని ఆర్ధిక ఇబ్బందులు నిర్మాతకు రావడంతో చేసేదేమి లేక అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది. 50 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హీరో, స్టార్ హీరో, వరుసగా నాలుగు 100 కోట్ల సినిమాలు ఉన్న హీరో, సీనియర్ హీరో, నందమూరు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో సినిమానే ఆగిపోతే, ఆ నిర్మాతకు సపోర్ట్ దొరకకపోతే ఇంక చిన్న, మీడియం సినిమాలు, హీరోల పరిస్థితి ఏంటి? ఆ సినిమాలు రిలీజయ్యే సమయంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి.
Also Read : Balakrishna – Chiranjeevi : మరోసారి సంక్రాంతి బరిలో బాలయ్య వర్సెస్ చిరంజీవి.. అఖండ 2 సంగతి అంతేనా?
ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ప్రీమియర్స్ ప్రకటించినా ప్రీమియర్స్ కూడా లేట్ గా పడ్డాయి. పవన్ తో సినిమా చేసిన నిర్మాత గత నష్టాలు, ఫైన్షియర్ల డబ్బులు చెల్లించాకే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడంతో హరిహర వీరమల్లు ముందు పెద్ద టెన్షన్ నడిచింది. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి తన సన్నిహితులు, నిర్మాత టిజి విశ్వప్రసాద్ మరికొందరితో మాట్లాడి అప్పటికప్పుడు 30 కోట్లు రెడీ చేసి సినిమా రిలీజ్ అయ్యేలా చేసారు.
గతంలో క్రాక్ సినిమాకు కూడా ఇలాగే ఆ నిర్మాత పాత సినిమాల నష్టాలు ఇవ్వాల్సిందే అంటూ రవితేజ క్రాక్ విడుదల ఆపారు. రిలీజ్ అనౌన్స్ రోజు మధ్యాహ్నానికి కానీ షోలు పడలేదు. బండ్ల గణేష్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో రిలీజ్ కి ముందు డబ్బులు ఫైన్షియర్స్ కి క్లియర్ చేయాలి ఆ టెన్షన్ రెండు రోజులు ఉంటుంది, ఆ సమయంలో కొంతమంది హీరోల సపోర్ట్ ఉంటే కానీ పని అవ్వదు అని చెప్పారు. ఇలా పెద్ద పెద్ద హీరోల సినిమాలకే రిలీజ్ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతుంటే ఇక చిన్న, మీడియం హీరోల సినిమాల పరిస్థితి దయనీయం.
Also Read : Samantha – Naga Chaitanya : మరోసారి ట్రెండింగ్ లో సమంత – నాగచైతన్య.. ఓ వైపు పెళ్లి.. మరో వైపు పెళ్లి రోజు..
ఇదీ ప్రస్తుతం టాలీవుడ్, నిర్మాతల పరిస్థితి..
టాలీవుడ్ సినీ పరిశ్రమ కరోనా తర్వాత, ఓటీటీ ప్రాబల్యం పెరిగాక మరింత పడిపోయింది. హిట్ సినిమాల శాతం తక్కువే. ఆ హిట్ అయిన సినిమాల డబ్బులు కూడా అన్ని నిర్మాతకు రావు. వంద రూపాయలలో కేవలం 28 రూపాయలు మాత్రమే నిర్మాతకు వస్తాయని బన్నీ వాసు, SKN అధికారికంగానే చెప్పారు. బాహుబలి 2 సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా నిర్మాత తమకేమి లాభాలు రాలేదని చెప్పారు. టికెట్ రేట్లు తగ్గిద్దామన్నా డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ ఒప్పుకోవట్లేదు నిర్మాతలు ప్రకటించారు.
కానీ చాలా మంది నిర్మాతలే మొత్తం తప్పులు చేస్తున్నట్టు, నిర్మాతలు బాగా డబ్బులు సంపాదించేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు విమర్శలు చేస్తారు. ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు. వీటికి తోడు పైరసీ అయితే ఆ పైరసీ ని సపోర్ట్ చేసి వాళ్ళేదో మంచి పని చేస్తున్నట్టు హైప్ ఇవ్వడం, వీటికి తోడు సినిమాని సినిమాలా చూడకుండా ఏదేదో మాట్లాడి సినిమాని నెగిటివ్ చేసే కొంతమంది యూట్యూబ్ రివ్యూయర్లు. ఇవన్నీ ఒకవైపు అయితే ఫ్యాన్ వార్స్ మరోవైపు. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో సినిమాని నాశనం చేయాలని చేయడం, మళ్ళీ ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో సినిమాని నాశనం చేయడానికి ట్రై చేయడం. మరోవైపు సినిమా కార్మికులే హైక్స్ కావాలంటూ ధర్నాలు, బంద్ లు చేయడం.
Also Read : Prabhas : అతను నా క్లాస్మేట్.. ఎవర్ని కలవడు.. ప్రభాస్ గురించి టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్..
ఇలా ఇన్ని నెగిటివ్స్ మధ్య హిట్ అవ్వడం పక్కన పెడితే హిట్ అయినా డబ్బులు రాక, జనాలు థియేటర్స్ రాక, ఫ్లాప్ అయి, పెట్టిన డబ్బులు కూడా రాక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు ఇలా సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో పలు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ లాభాలు వస్తే మాకివ్వట్లేదు కానీ నష్టాలు వస్తే మేము కట్టాల్సి వస్తుందని కూడా వ్యాఖ్యలు చేసారు.
వారం వారం దాదాపు చిన్న మీడియం పెద్ద సినిమాలు కలిపి అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నా సంవత్సరానికి 250 పైనే సినిమాలు రిలీజ్ అవుతున్నా పెద్ద, స్టార్ హీరోల సినిమాలతో సహా అందరూ బయటకి మాది హిట్ అంటే మాది హిట్ అని చెప్పుకున్నా గట్టిగా హిట్ అయి డబ్బులు మిగిలేవి కేవలం 20 మాత్రమే. ఓ 30 సినిమాలు అక్కడికక్కడే సేఫ్ అయిన మిగిలిన 200 సినిమాలు నష్టాల పాలే. ఇన్ని జరుగుతున్నా నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు.
నిర్మాతలు కూడా కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. టికెట్ రేట్ల విషయం, హాల్లో అమ్మే తినుబండారాలు వాళ్లకు సంబంధం లేకపోయినా వాటి రేట్లు కూడా తగ్గేలా చూడటం, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నీట్ గా మెయింటైన్ చేసేలా చూడటం, రీ రిలీజ్ లు ఆపడం, రిలీజ్ డేట్స్ క్లాష్ లేకుండా చూసుకోవడం, షూటింగ్ వేస్టేజ్ తగ్గించడం, ఓటీటీని ముందే అనౌన్స్ చేయకుండా ఉండటం, స్టార్ హీరో – హీరోయిన్స్ కూడా ప్రమోషన్స్ కి వచ్చేలా చూడటం.. లాంటి జరత్తలు తీసుకోకపోతే సినీ పరిశ్రమ మరింత దయనీయ స్థితికి వెళ్లడం ఖాయం.