Balakrishna – Chiranjeevi : మరోసారి సంక్రాంతి బరిలో బాలయ్య వర్సెస్ చిరంజీవి.. అఖండ 2 సంగతి అంతేనా?
ఒక వేళ బాలయ్య సంక్రాంతికి వస్తే చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు తో పోటీ తప్పదు. (Balakrishna - Chiranjeevi)
Balakrishna Chiranjeevi
Balakrishna – Chiranjeevi : బాలయ్య ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అఖండ 2 తాండవం సినిమా నేడు రిలీజవ్వాల్సి ఉంది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేస్తారని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసారు. ఆ తర్వాత రిలీజ్ కూడా ఆపేసారు. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు పాత నష్టాలు కట్టాల్సి రావడం.. లాంటి పలు ఆర్ధిక ఇబ్బందులతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.(Balakrishna – Chiranjeevi)
మూవీ యూనిట్ అధికారికంగానే రిలీజ్ చెయ్యట్లేదు, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని చెప్పారు. అయితే అఖండ 2 సినిమా సంక్రాంతికి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ లో ఈ డేట్ తర్వాత హాలిడేస్ ఏమి లేవు. 12 వ తారీఖు దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. క్రిస్మస్ కి రిలీజ్ చేద్దామనుకున్నా అప్పుడు కూడా ఆల్మోస్ట్ నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ దాటితే న్యూ ఇయర్ కి కానీ, సంక్రాంతికి కానీ రిలీజ్ చేయాలి.
Also Read : Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో మరో మెగా హీరో..
సంక్రాంతి అయితే పండగ సీజన్ కూడా కలిసొస్తుంది, అందుకే అప్పుడే రిలీజ్ చేస్తారని అంటున్నారు పలువురు. అయితే ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి, రవితేజ, ప్రభాస్, నవీన్ పోలిశెట్టి సినిమాలు బరిలో ఉన్నాయి. ఇవి కాకుండా తమిళ డబ్బింగ్ సినిమాలు రెండు ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి పోటీ ఎక్కువైంది. మరి ఇలాంటి పోటీలో అఖండ 2 జాయిన్ అవుతుందా? మరోసారి బాలయ్య -చిరంజీవితో తలపడతారా చూడాలి.
టాలీవుడ్ సమాచారం ప్రకారం డిసెంబర్ 18 డేట్ ఖాళీగా ఉందని, అప్పుడు నోటెడ్ సినిమాలు ఏమి లేవని, కాకపోతే అది నార్మల్ డేట్, సెలవులు లాంటివి ఏమి లేవు కానీ ఆ రోజు సోలోగా రావొచ్చు అని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే టాలీవుడ్ వేరే సినిమాల నిర్మాతలు తమ సినిమాల డేట్ కి ఇబ్బంది లేకుండా రావాలని కోరుకుంటున్నారు.
Also Read : Akhanda-2: అఖండ-2 కొత్త రిలీజ్ డేట్ ఇదే?
Balakrishna – Chiranjeevi
ఒక వేళ బాలయ్య సంక్రాంతికి వస్తే చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు తో పోటీ తప్పదు. గతంలో బాలకృష్ణ – చిరంజీవి సంక్రాంతికి 10 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ – అఖండ 2 సినిమాలతో 11వ సారి అవుతుంది.
మొదటిసారి 1985లో బాలకృష్ణ ఆత్మబలం – చిరంజీవి చట్టంతో పోరాటం సినిమాలు పోటీ పడ్డాయి. ఆ తర్వాత 1987లో చిరంజీవి దొంగ రాముడు – బాలకృష్ణ భార్గవ రాముడు సినిమాలు, 1988లో చిరంజీవి మంచి దొంగ – బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సినిమాలు, 1997లో చిరంజీవి హిట్లర్ – బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాలు, 1999లో చిరంజీవి స్నేహం కోసం – బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాలు, 2000లో బాలకృష్ణ వంశోద్ధారకుడు – చిరంజీవి అన్నయ్య సినిమాలు, 2001లో బాలకృష్ణ నరసింహనాయుడు – చిరంజీవి మృగరాజు సినిమాలు, 2004లో బాలకృష్ణ లక్ష్మీనరసింహ – చిరంజీవి అంజి సినిమాలు, 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 – బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు పోటీ పడ్డాయి. 2023లో చిరంజీవి వాల్తేరు వీరయ్య – బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ ఇద్దరూ ఫిక్స్ అయితే 11వ సారి పోటీ పడనున్నట్టే.
