Pawan Kalyan : పవన్‌ కల్యాణ్ సినిమాలో మరో మెగా హీరో..

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ (Pawan Kalyan )మళ్లీ సినిమాల మూడ్‌లోకి వెళ్లిపోయారు.

Pawan Kalyan : పవన్‌ కల్యాణ్ సినిమాలో మరో మెగా హీరో..

Gossip Garage Is Another mega hero in Pawan Kalyans movie

Updated On : December 5, 2025 / 9:05 AM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఓజీ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌ మీదున్న పవన్, పాలిటిక్స్‌తో పాటు మూవీస్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తానని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్‌ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారట.

దిల్‌రాజ్ నిర్మాతగా ఇంకో ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా పవన్‌ చేయబోతున్నారంటున్న సినిమాపై గాసిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా పేరు కోసం ఆల్రెడీ అర్జున అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్న చర్చ మొదలైంది.

Lenin: ఈ ఇయర్ అన్న కొట్టాడు.. నెక్స్ట్ ఇయర్ తమ్ముడు కొడతాడా.. లెనిన్ కోసం అదిరిపోయే డేట్ ఫిక్స్..

పవన్(Pawan Kalyan), దిల్‌రాజు కాంబినేషన్‌లో రాబోతోందని చెప్తున్న మూవీపై టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్‌తో పాటు, మరో మెగా హీరో కూడా నటిస్తాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ్, పవన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారట.

సాయిధరమ్ తేజ్ దిల్‌రాజు బ్యానర్‌లో పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీం లాంటి సినిమాలు చేశాడు. ఇక పవన్ కల్యాణ్‌ వకీల్ సాబ్ లాంటి సినిమా చేశారు. అయితే ఈసారి మామ అల్లుడు ఇద్దరితో కలిసి దిల్‌రాజు సినిమా నిర్మించబోతున్నాడట. టైటిల్ కూడా అర్జున అని పెట్టడంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మరి పవన్, సాయిధరమ్ కాంబో నిజమా.? కాదా.? అనేది వేచి చూడాలి.