Lenin: ఈ ఇయర్ అన్న కొట్టాడు.. నెక్స్ట్ ఇయర్ తమ్ముడు కొడతాడా.. లెనిన్ కోసం అదిరిపోయే డేట్ ఫిక్స్..
అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్(Lenin). దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు.
Akkineni Akhil Lenin movie to release on Valentine's Day
Lenin: సాధారణంగా సినిమాలు ఇప్పుడు ఈజీ అయిపొయింది. కానీ, అది విడుదలై హిట్ అవ్వాలంటే చాలా ఫాక్టర్స్ అనుకూలించాలి. వాటిలో సరైన రిలీజ్ డేట్ చాలా ముఖ్యం. చాలా మంచి సినిమాలు సరైన టైంలో విడుదల అవ్వక ప్లాప్స్ గా నిలిచాయి. తాజాగా అలాంటి పర్ఫెక్ట్ డేట్ ను తన రిలీజ్ కోసం పట్టేశాడు అక్కినేని అఖిల్. ఈ హీరో చేస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్(Lenin). దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.
Rahul-Harinya: మాల్దీవ్స్ లో కొత్త జంట.. హనీమూన్ వెకేషన్ లో రాహుల్-హరిణ్య..
తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు అఖిల్ లెనిన్ సినిమాను 2026 ఫిబ్రవరి 14న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల దినోత్సవం. లెనిన్ సినిమాలో కూడా లవ్ కంటెంట్ చాలా ఉంటుందట. అలాగే ఇంటెన్స్ తో కూడా లవ్ సీన్స్ కూడా ఉంటాయట. కాబట్టి, ప్రేమికుల రోజున ఈ సినిమాను విడుదల చేస్తే సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్.
ఇక 2025లో నాగ చైతన్య నటించిన తండేల్ కూడా ఇంచుమించు ఇదే సమయంలో విడుదల అయ్యింది. ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7న విడుదల చేశారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు సరిగ్గా ఏడాది తరువాత తమ్ముడు అఖిల్ కూడా అదే టైం కి తన సినిమాను విడుదల చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే కొంచం పాజిటీవ్ టాక్ వచ్చినా లెనిన్ సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక లెనిన్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
