Sarath Babu : సినీ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి.. లేటెస్ట్ అప్డేట్!

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కి తరలించారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు తెలియజేశారు.

Sarath Babu : సినీ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి.. లేటెస్ట్ అప్డేట్!

Tollywood Senior actor Sarath Babu health update

Updated On : April 22, 2023 / 4:26 PM IST

Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ వస్తున్నారు. తాజాగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు శుక్రవారం (ఏప్రిల్ 21) నాడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆస్పత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం ఐసీయూలో అడ్మిట్ చేయించారు.

Naga Chaitanya – Akhil : మాస్ ఇమేజ్ కోసం అన్నదమ్ముల పోరాటం.. ఈసారి వచ్చేనా?

వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. అలాగే ఆయనని ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించి అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులు, ప్రముఖులు శరత్ బాబు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శరత్ బాబు 1973లో తెలుగు సినిమా ‘రామరాజ్యం’ తో వెండితెరకు పరిచయం అయ్యాడు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.

Samyuktha : టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయ్యిపోయిన సంయుక్త.. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ సినిమా కూడా!

తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించారు. 200 పైగా సినిమాలో నటించిన శరత్ బాబు.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్ ని అలరించాడు. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించారు. అంతేకాదు పలు టెలివిజన్ షోస్ లో కూడా శరత్ బాబు నటించారు.