Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత..

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు.. చికిత్స పొందుతూ నేడు కన్నుముశారు.

tollywood senior actor sarath babu passed away

Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సంగతి తెలిసిందే. ఏప్రిల్ 21 నాడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బెంగళూరు హాస్పిటల్ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రికి అయన కుటుంబసభ్యులు తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు నేడు కన్నుమూశారు. మల్టీ ఆర్గాన్స్ పూర్తి గా డ్యామేజ్ అవ్వడంతో అయన మృతి చెందినట్లు సమాచారం.

Music director Raj : ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత

తెలుగు కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో నటించిన శరత్ బాబు 220 కి పైగా సినిమాల్లో నటించారు. 1973లో తెలుగు సినిమా ‘రామరాజ్యం’ తో వెండితెరకు పరిచయం అయిన శరత్ బాబు.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్ ని అలరించారు. తెలుగులో ఆయన నటించిన చివరి సినిమా నరేష్, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’. తమిళంలో బాబీ సింహ ‘వసంత ముల్లై’.