Tollywood
Tollywood : మన టాలీవుడ్ లో క్రికెట్ బాగా ఆడవాళ్లు చాలా మంది ఉన్నారని తెలిసిందే. అఖిల్, తమన్, తరుణ్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మ.. ఇలా చాలా మంది క్రికెట్ బాగా ఆడతారు. వీళ్లంతా ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక మ్యాచ్ లు ఆడతారు. ఇక సెలెబ్రిటీ క్రికెట్ లో రెచ్చిపోయి మరీ ఆడతారు. తాజాగా ఈ టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి అమెరికాలో క్రికెట్ ఆడి కప్ గెలిచారు.
అమెరికాలో నాట్స్( నార్త్ అమెరికా తెలుగు సంఘం) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మన టాలీవుడ్ స్టార్స్ అక్కడి తెలుగువారితో ఆడి గెలిచారు. ఇటీవల ఈ నాట్స్ వేడుకలకు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయిన సంగతి తెలిసిందే. తమన్ కెప్టెన్సీ లో, వెంకటేష్ పర్యవేకషణలో టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడి గెలిచారు. గెలిచిన కప్ తో ఫొటోలు దిగారు.
Also Read : Ali : ఒక అమ్మాయి నో చెప్పిందని నా మేనల్లుడు చనిపోయాడు.. అలీ ఎమోషనల్ కామెంట్స్..
హీరో ఆది తాము గెలిచిన కప్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోలో వెంకటేష్, తమన్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మ ఉన్నారు. వీరంతా వెంకటేష్ నుంచి కప్ తీసుకున్నట్టు ఫోటో దిగారు. ఇక ఈ మ్యాచ్ లో ఆది బెస్ట్ బౌలర్ గా కూడా మెమెంటో గెలిచాడు. దీంతో ఆది షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
Also Read : Vijay Deverakonda : అయిదేళ్ల వయసు నుంచే అమ్మ నాన్న లేకుండా బతకడం నేర్చుకున్నా..