Ali : ఒక అమ్మాయి నో చెప్పిందని నా మేనల్లుడు చనిపోయాడు.. అలీ ఎమోషనల్ కామెంట్స్..
ఈ ఈవెంట్లో అలీ మాట్లాడుతూ..

Ali
Ali : కమెడియన్ అలీ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ సినిమాలో చాన్నాళ్ల తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ మంచి క్యారెక్టర్ లో అలీ నటించాడు. ఈ సినిమా జులై 11 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Also Read : Vijay Deverakonda : అయిదేళ్ల వయసు నుంచే అమ్మ నాన్న లేకుండా బతకడం నేర్చుకున్నా..
ఈ ఈవెంట్లో అలీ మాట్లాడుతూ.. సుహాస్ కి మామయ్య క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అంటే 15 ఏళ్ళ క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క చనిపోతే వాడ్ని చిన్నప్పట్నుంచి మా అమ్మే పెంచింది. వాడు నా ముందే ఎదిగాడు. కానీ ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో చెప్తే తను చనిపోయాడు. అప్పట్నుంచి మా అమ్మ చాలా బాధపడి రోజూ ఏడ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్ చెప్పాక నేను దానికి కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ క్యారెక్టర్ కి ఒప్పుకున్నాను. సినిమాలో సుహాస్ ని చూస్తుంటే నా మేనల్లుడు గుర్తొచ్చాడు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
Also Read : Samantha : రూమర్ బాయ్ ఫ్రెండ్ తో అమెరికాలో సమంత.. భుజంపై చెయ్యి వేసి.. రాజ్ – సమంత క్లోజ్ ఫోటో వైరల్..