World Cup final : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ తుది పోరుని లైవ్ లో వీక్షించేందుకు టాలీవుడ్ టు బాలీవుడ్ బడా స్టార్స్ అంతా స్టేడియంకి చేరుకున్నారు.

Tollywood to Bollywood celebrities at ODI World Cup 2023

World Cup final : క్రికెట్ వరల్డ్ కప్ తుది పోరు మొదలయ్యిపోయింది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కి చేరుకున్న భారత్.. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 2003 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఓడిపోయిన భారత్.. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒకరు మ్యాచ్ చూడడంలో నిమగ్నమయ్యారు. ఇక ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్టేడియంకి చేరుకున్నారు. వారికీ సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ తుది పోరుని లైవ్ లో వీక్షించేందుకు టాలీవుడ్ టు బాలీవుడ్ బడా స్టార్స్ అంతా స్టేడియంకి చేరుకున్నారు. ఇండియన్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, వెంకటేష్, మహేష్ బాబు, అఖిల్ అక్కినేని, దీపికా పదుకొనె, అనుష్క శర్మ తదితరులు మ్యాచ్ కి హాజరయ్యి స్టేడియంలో ఆడియన్స్ తో కలిసి సందడి చేస్తున్నారు. ఇక వీటిలో షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో షారుఖ్.. ఆశా భోంస్లే తాగిన టీ కప్ ని తీస్తూ కనిపించారు.

Also read : Nani – Salman : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నాని, సల్మాన్ ఖాన్ కామెంటరీ..

స్టేడియంలో విఐపి సెక్షన్ లో షారుఖ్, ఆశా భోంస్లే పక్క పక్కన కూర్చొని మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. అయితే అక్కడ ఆశా భోంస్లే మ్యాచ్ చూస్తూ ఒక కప్ టీని ఆస్వాదించారు. టీ తాగిన అనంతరం ఆమె ఆ కప్ ని ఎక్కడ పెట్టాలో తెలియక చేతిలోనే పట్టుకొని కూర్చున్నారు. ఇది గమనించిన షారుఖ్ ఆమె చేతిలో నుంచి ఆ కప్ ని తీసుకోని దానిని స్టేడియం స్టాఫ్ కి అందిస్తూ కనిపించారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. పెద్దవారికి ఎలా గౌరవం ఇవ్వాలో షారుఖ్ ని చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.