Nani – Salman : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నాని, సల్మాన్ ఖాన్ కామెంటరీ..
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నాని, సల్మాన్ ఖాన్ కామెంట్రీ. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Nani Salman Khan commentary ODI World Cup 2023 final match
Nani – Salman Khan : అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పోరు జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా జట్టులు ప్రపంచ ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటి బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు భారీ స్కోర్ ఇచ్చేందుకు బరిలో పోరాడుతున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ కి చేరుకున్న భారత్ జట్టు.. ఈరోజు ఏం చేయనుందో అని అందరూ ఆసక్తితో ఎదురు చుస్తునారు. దీంతో దేశమంతటా ఈ మ్యాచ్ ని చూస్తూ నిమగ్నమయ్యారు.
ఈ మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్టేడియంకి చేరుకున్నారు. ఈక్రమంలోనే కేంద్రమంత్రి అమిత్ షా, ఇండియన్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, వెంకటేష్, మహేష్ బాబు, అఖిల్ అక్కినేని, దీపికా పదుకొనె.. తదితరులు మ్యాచ్ కి హాజరయ్యి నరేంద్రమోదీ స్టేడియంలో ఆడియన్స్ తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ స్టార్స్ అంతా స్టేడియంలో సందడి చేస్తుంటే.. నాని, సల్మాన్ ఖాన్ కామెంటరీ రూమ్ లో కూర్చొని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
Also read : Karthika Nair : ఏడడుగులు వేసేసిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళిలో చిరంజీవి సందడి..
తెలుగు కామెంటరీని నాని చేస్తుంటే, హిందీ కామెంటరీలో సల్మాన్ ఖాన్ పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక ఈక్రమంలో నాని, సల్మాన్ ఖాన్ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరూ క్రికెట్ కామెంట్రీతో పాటు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు కూడా వచ్చారు. సల్మాన్ టైగర్ 3 రిలీజ్ అయ్యి థియేటర్స్ లో రన్ అవుతుంటే, నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ ప్రమోషన్స్ కోసం నాని ప్రస్తుతం ఎలక్షన్స్ ఫీవర్‌ని, వరల్డ్ కప్ ఫీవర్‌ని ఉపదయోగించేసుకుంటున్నారు.