Karthika Nair : ఏడడుగులు వేసేసిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళిలో చిరంజీవి సందడి..
టాలీవుడ్ హీరోయిన్ కార్తీక పెళ్లి నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అలనాటి తారలతో కలిసి చిరంజీవి సందడి చేశారు.

Chiranjeevi at Radha daughter Karthika Nair marriage photos
Karthika Nair : ‘జోష్’ సినిమాలో నటించి హీరో నాగచైతన్యతో పాటు హీరోయిన్ కార్తీక కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు. ఇక ఇటీవటే చేతికి ఉంగరం తొడిగి ఉన్న ఫోటోని షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రేక్షకులకు తెలియజేశారు.
తాజాగా ఆమె ఏడడుగులు కూడా వేసేశారు. రోహిత్ మీనన్ అనే అబ్బాయితో కార్తీక నేడు మూడు ముళ్ళు వేయించుకున్నారు. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరయ్యి కొత్త జంటకి దీవెనలు అందించారు. చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి.. తదితరులు ఈ పెళ్లి వేడుకలో కనిపించారు. ఇక చాలా గ్యాప్ తరువాత అప్పటి తారలంతా ఈ పెళ్ళిలో కలుసుకోవడంతో అందరూ కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : Jayasudha : జయప్రద, శ్రీదేవి కాంట్రవర్సీ విషయంలో జయసుధ ఏమన్నారంటే?
Annayya #Chiranjeevi garu attended @ActressRadha‘ s Daughter @KarthikaNair9 and Rohit wedding in Trivandrum
Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/3ZOATcHuRa
— శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్ (@PathinaSrinu) November 19, 2023
కాగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తీక.. రంగం సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. కానీ ఆ తరువాత మళ్ళీ అలాంటి విజయం అందలేదు. జూనియర్ ఎన్టీఆర్ పక్కన దమ్ము సినిమాలో నటించనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కెరీర్ మొత్తంలో కేవలం తొమ్మిది సినిమాల్లో మాత్రమే కార్తీక నటించారు. 2015లో చివరిగా ఒక తమిళ్ సినిమాలో నటించారు. 2017లో ‘ఆరంభ్’ అనే హిందీ టెలివిజన్ సీరియల్‌లో నటించారు. ఆ తరువాత నుంచి యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసి దుబాయ్ వెళ్లి బిజినెస్ వుమెన్ గా మారారు.