Jayasudha : జయప్రద, శ్రీదేవి కాంట్రవర్సీ విషయంలో జయసుధ ఏమన్నారంటే?

ఇటు సినిమాలు.. అటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు సహజ నటి జయసుధ. రీసెంట్‌గా మీడియాతో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

Jayasudha : జయప్రద, శ్రీదేవి కాంట్రవర్సీ విషయంలో జయసుధ ఏమన్నారంటే?

Jayasudha

Updated On : November 19, 2023 / 3:26 PM IST

Jayasudha : 1972 లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో మొదలుపెట్టి రీసెంట్ గా రిలీజైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వరకు నాన్ స్టాప్‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు సహజ నటి జయసుధ. ఇటీవల మీడియాతో జయసుధ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

జయసుధ అసలు పేరు సుజాత. నటి, నిర్మాత విజయనిర్మల జయసుధకు స్వయానా మేనత్త. 1972 లో లక్ష్మీదీపక్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పండంటి కాపురం’ జయసుధ మొదటి చిత్రం. జయసుధ తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో 25 సినిమాలు, దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో 27 సినిమాలు నటించడమే కాకుండా.. ఒకే సంవత్సరంలో ఆమె నటించిన 25 సినిమాలు విడుదల కావడం విశేషం.

Sanjay Gadhvi : ‘ధూమ్’ సిరీస్ డైరెక్టర్ మృతి.. మూడు రోజుల్లో బర్త్‌డే అంతలోనే..!

ఇటీవల జయసుధ మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. అప్పట్లో సీనియర్ హీరోలతో నటించడం చాలా ఇబ్బందిగా ఉండేదని.. రాను రాను అలవాటైందని చెప్పారు. శోభన్ బాబు, చంద్రమోహన్ తనకు మంచి స్నేహితులు అన్నారు. చాలామంది నటులు తమ వ్యక్తిగత సమస్యలు శోభన్ బాబుతో చెప్పుకునేవారని ఆయన ఓపిగ్గా విని సలహాలు ఇచ్చేవారని జయసుధ చెప్పారు. తెలుగులో జయప్రద, శ్రీప్రియ, రాధిక మంచి స్నేహితులమని.. రాధిక చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు జయసుధ. రాధిక ఇంట్లో మూడేళ్లు ఉన్నామని చెప్పారు.

Rithu Chowdhary : తండ్రి శవం మీద ఆ నటి చేసిన ప్రామిస్ ఏంటంటే?

జయసుధ, శ్రీదేవి మధ్య కాంట్రవర్సీ గురించి జయసుధ తనకేమీ తెలియదని చెప్పారు. జయప్రద, శ్రీదేవి హిందీ ఫీల్డ్‌కి వెళ్లిన తర్వాత వారి మధ్య ఏం జరిగిందో తనకు ఐడియా లేదన్నారు. అయితే ‘తోఫా’ సినిమా టైమ్‌లో గొడవ జరిగినట్లు అందరూ అంటుంటారని అన్నారు.  జయప్రదతో తనకు సినిమా స్నేహం మాత్రమే అని.. కలిసినా పర్సనల్ విషయాలు మాట్లాడుకోమని అన్నారు జయసుధ.

2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు జయసుధ. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారామె. 2023 లో వారసుడు, మళ్లీ పెళ్లి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల్లో నటించారు. ఇటు సినిమాలు.. అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు జయసుధ.