Sanjay Gadhvi : ‘ధూమ్’ సిరీస్ డైరెక్టర్ మృతి.. మూడు రోజుల్లో బర్త్‌డే అంతలోనే..!

ధూమ్ సిరీస్ తో ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్న బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గద్వి ఈరోజు ఉదయం మరణించారు.

Sanjay Gadhvi : ‘ధూమ్’ సిరీస్ డైరెక్టర్ మృతి.. మూడు రోజుల్లో బర్త్‌డే అంతలోనే..!

Bollywood Dhoom movie series director Sanjay Gadhvi passed away

Updated On : November 19, 2023 / 2:36 PM IST

Sanjay Gadhvi : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గద్వి.. ఈరోజు ఉదయం 56 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఆయన మరణం హిందీ పరిశ్రమ ప్రముఖలను, బి-టౌన్ ప్రేక్షకులను శోఖానికి గురి చేసింది. సంజయ్ కుమార్తె సంజిన గద్వి తండ్రి మరణం గురించి అందరికి తెలియజేశారు. ఈరోజు ఉదయం గం.9:30 నిమిషాల సమయంలో సంజయ్ ఆయన ఇంటిలోని తుది శ్వాస విడిచినట్లు ఆమె పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం గానే ఉన్నారని, కానీ ఇలా ఎలా జరిగిందో తెలియదని ఆమె పేర్కొన్నారు. హార్ట్ ఎటాక్ వలనే ఇలా జరిగి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

కాగా మరో మూడు రోజుల్లో సంజయ్ గద్వి బర్త్ డే ఉంది. 1965 నవంబర్ 22న ఆయన జన్మించారు. 56 ఏళ్ళ వయసు ఉన్న సంజయ్ మూడు రోజుల్లో 57 ఏట అడుగుపెడుతున్నారు అనుకుంటే అంతలోనే ఇలా జరిగి కుటుంబసభ్యులలో తీవ్ర శోకాన్ని మిగిలిచింది. ఇక ఈయన మరణం గురించి తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ, అభిషేక్ బచ్చన్, బిపాసా బసు.. వంటి తారలు తమ సోషల్ మీడియా ఖాతాలో సంతాపం తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Also read : Rithu Chowdhary : తండ్రి శవం మీద ఆ నటి చేసిన ప్రామిస్ ఏంటంటే?

సంజయ్ గద్వి.. ధూమ్ సిరీస్ తో మంచి పేరుని సంపాదించుకున్నారు. ‘తేరే లియే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంజయ్ మూడో సినిమాగా ‘ధూమ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం కలయికలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ గా ధూమ్ 2 తీసుకు వచ్చారు. ఈ సీక్వెల్ లో హృతిక్ రోషన్, అభిషేక్, ఐశ్వర్య, బిపాసా బసు వంటి స్టార్స్ నటించారు.

ఈ చిత్రం ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది. ధూమ్ 2 తరువాత కేవలం మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. చివరిగా 2020లో ‘ఆపరేషన్ పరిందే’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. కెరీర్ మొత్తంలో కేవలం ఏడు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేశారు.