Rithu Chowdhary : తండ్రి శవం మీద ఆ నటి చేసిన ప్రామిస్ ఏంటంటే?

రీతూ చౌదరి టీవీ స్క్రీన్ పై పాపులారిటీ ఉన్న నటి. ఇటీవల తండ్రి మరణంతో ఆమె కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని రీతూ ఎమోషనల్ అయ్యారు.

Rithu Chowdhary : తండ్రి శవం మీద ఆ నటి చేసిన ప్రామిస్ ఏంటంటే?

Rithu Chowdhary

Updated On : November 19, 2023 / 1:55 PM IST

Rithu Chowdhary : టీవీ సీరియల్స్, షోలు ఫాలో అయ్యేవారికి పరిచయం ఉన్న నటి రీతూ చౌదరి. సోషల్ మీడియాలో కూడా రీతూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల తండ్రి మరణం రీతూ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.  తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు.

Vaishnav Tej : ఆ నటితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

రీతూ చౌదరి.. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌తో బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ షో ఆమెకు పాపులారిటీ తెచ్చింది. పలు టీవీ షోలలో కూడా కనిపించే రీతూ చౌదరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల రీతూ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి హఠాన్మరణంతో ఆమె కుటుంబంలో దు:ఖంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి బయటకు వస్తున్న రీతూ చౌదరి తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. చాలా ఎమోషనల్ అయ్యారు.

రీతూ చౌదరి తన నానమ్మ సంవత్సరీకాల కోసం ఫ్యామిలీతో కలిసి ఊరికి వెళ్లారు. ఆ సమయంలో తండ్రి చాలా సరదాగా ఉన్నారని.. యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండమని, ఊరి గురించి కూడా ఒక వ్లాగ్ చేయమని చెప్పారని రీతూ అన్నారు. రాత్రంతా కబుర్లు చెప్పిన తండ్రి తెల్లారేసరికి చనిపోయారని తెలిసి తట్టుకోలేకపోయానని రీతూ అన్నారు. తనకు గుండె నొప్పి వస్తున్నా నిద్ర లేపవద్దని చెప్పారని.. తన చివరి క్షణాలు చూడలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫస్ట్ శాలరీతో కొన్న కారులో తండ్రి శవాన్ని ఇంటికి తీసుకురావడం చాలా బాధకలిగించిందని ఆ కారులో ఎప్పుడు కూర్చున్నా ఆయన తనతో ఉన్నట్లు ఫీలవుతానని రీతూ అన్నారు.

Salman Khan : హీరోకి స్టేజిపై అందరిముందు ముద్దులు పెట్టిన సల్మాన్ ఖాన్..

తండ్రి మరణాన్ని తన అన్నయ్య జీర్ణించుకోలేకపోయాడని మౌనంగా ఉండిపోయాడని చెప్పారు రీతూ. తండ్రి లేని బాధని దిగమింగుకుని కుటుంబం బాధ్యతను తాను తీసుకుంటానని తండ్రి శవంపై ప్రామిస్ చెసినట్లు రీతూ చెప్పుకొచ్చారు. తన తల్లి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని నటిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు రీతూ చౌదరి.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)