Chiranjeevi : మెగాస్టార్ కోసం ఇండస్ట్రీ అంతా ఒకేచోటకి చేరబోతుందా? దిల్ రాజు ఏమన్నారంటే..?

చిరంజీవి కోసం మళ్ళీ టాలీవుడ్ అంతా ఒకచోటికి రాబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Tollywood will coming together to congratulate Chiranjeevi on selecting Padma Vibhishan award

Megastar Chiranjeevi : ఇటీవల కేంద్రప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్(Padma Vibhushan) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటి నుంచి చిరంజీవికి అభినందనలు వస్తూనే ఉన్నాయి. గతంలోనే చిరంజీవికి పద్మ భూషణ్ అవార్డు వరించింది. ఇప్పుడు పద్మ విభూషణ్ కూడా అందుకుంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది.

గతంలో చిరంజీవి పద్మ భూషణ్ అందుకున్నప్పుడు ఆయన్ని సన్మానిస్తూ టాలీవుడ్ ఓ ఈవెంట్ చేసింది. అప్పుడు కొంతమంది సినీ ప్రముఖులు ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. ఇప్పుడు ఓ భారీ ఈవెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు(Dil Raju) తాజాగా మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిని అభినందించి.. త్వరలో చిరంజీవికి చిత్రసీమ అంతా కలిసి అభినందించేలా ఓ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేయాలనుకుంటున్నాము. సినీ పెద్దలతో మాట్లాడి త్వరలోనే దీని గురించి వివరాలు ప్రకటిస్తాము అన్నారు.

దీంతో మరోసారి టాలీవుడ్(Tollywood) అంతా ఒక్కచోటికి వస్తుందా అనే సందేహం వ్యక్తమవుతుంది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ 75 వసంతాల వేడుకలో తెలుగు సినీ పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ నుంచి అందర్నీ కలుపుకొని వేలమందితో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. అప్పట్లో మన హీరోలు, కమెడియన్లు, హీరోయిన్స్.. అంతా కలిసి ఒక సాంగ్ కూడా చేసారు. అందరి టాలీవుడ్ ప్రముఖులు ఒకే వేదికపై కనపడి అభిమానులని, ప్రేక్షకులని అలరించారు. ఇంతమంది మళ్ళీ ఒకేసారి కనిపిస్తారో లేదో అనుకున్నారు.

Also Read : Chiranjeevi : ‘పద్మవిభూషణుడు’ చిరంజీవికి అభినందనల వెల్లువ.. సెలబ్రెటీలు ఎవరెవరు విషెష్ చెప్పారంటే..

అయితే ఇప్పుడు చిరంజీవి కోసం మళ్ళీ టాలీవుడ్ అంతా ఒకచోటికి రాబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ పద్మ విభూషణ్ కి ఎంపికైనందుకు ఇప్పటికే ఆల్మోస్ట్ టాలీవుడ్ ప్రముఖులంతా చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. కొంతమంది డైరెక్ట్ గా కలిసి విషెష్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ టాలీవుడ్ స్టార్స్ హీరోలు, హీరోయిన్స్, సీనియర్ నటీనటులు, దర్శకులు, సాంకేతిక సిబ్బంది.. ఇలా చాలా మందిని చిరంజీవి పద్మ విభూషణ్ అభినందన సభకి రప్పించాలని, ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని, ఆల్రెడీ సినిమాల్లో దూసుకుపోతున్న టాలీవుడ్ ని మరోసారి గట్టిగా అన్ని పరిశ్రమలకు వినిపించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదే కనక జరిగితే అభిమానులు, ప్రేక్షకులు అంతా ఆనందిస్తారు. టాలీవుడ్ కూడా అంతా ఒకేచోట కనిపిస్తుంది. చూడాలి మరి చిరంజీవి అభినందన సభ ఏ రేంజ్ లో చేస్తారో.