Spider Man Brand New Day : ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఫైనల్ ట్రైలర్ రిలీజ్.. తెలుగులో కూడా..
మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.. (Spider Man Brand New Day)
Spider Man Brand New Day
Spider Man Brand New Day : మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో సినిమా ఇది. ఈ సినిమా జూలై 30న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. టామ్ హాలండ్ తో పాటు జెండయా, సేడీ సింక్, జేకబ్ బటాలన్, జాన్ బెర్న్తాల్, ట్రామెల్ టిల్మన్, మైకేల్ మాండో, మార్క్ రఫాలో.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
Also Read : Objection My Lord : వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ రిలీజ్.. లాయర్ గా శ్రీకాంత్..
ఈ ట్రైలర్లో.. స్పైడర్-మ్యాన్: నో వే హోమ్ తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో, తన ప్రేమికురాలు ఎంజేతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ ట్రైలర్లో మార్క్ రఫాలో హల్క్ పాత్రలో కనిపించనున్నట్లు చూపించారు. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో ఆసక్తికరమైన అధ్యాయం మొదలు కానుందని తెలుస్తుంది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్, జస్టిన్ కురిట్జ్‌కెస్ కథను అందించగా కెవిన్ ఫైగీ, ఏమీ పాస్కల్, అవి ఆరాడ్, రాచెల్ ఓ’కానర్ నిర్మాణంలో తెరకెక్కింది.
స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
