Chiru
Chiranjeevi: పాతికేళ్ల చరిత్ర ఉన్న ‘మా’ అసోసియేషన్ నిరంతరం వివాదం అవుతుంది. ఎన్నో ఎన్నికలు జరిగినా.. ఈసారి మాత్రం తీవ్ర వివాదం అవుతోంది. లేటెస్ట్‌గా ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా స్పందించారు.
పెళ్లిసందD కార్యక్రమంలో మా ఎన్నికలపై చిరు హాట్ కామెంట్స్ చేశారు. పెళ్లి సందD ఫ్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. వివాదాల సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలని చిరంజీవి అన్నారు.
చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని చిరంజీవి సూచించారు. వివాదాలతో నటులు చులకన కావద్దని అన్నారు. పదవులు తాత్కాలికమేనని, మనమంతా వసుధైక కుటుంబం అని అన్నారు. బయట వాళ్లకు ఇండస్ట్రీ ఎంతో లోకువ అయ్యిందని అన్నారు చిరంజీవి. పదవుల కోసం ఒకరినొకరు కించపరచొద్దని అన్నారు. అల్లర్లోతో ”మా” పరువు తీయొద్దని సూచించారు.