Trimukha
Trimukha : యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’. అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ జనవరి 30న రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ రాజేశ్ నాయుడు మాట్లాడుతూ.. మంచి కథ, బలమైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తీసాను. సెకండాఫ్ తల పక్కకు తిప్పనంతగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుంది. సన్నీ లియోన్ ని ఇప్పటిదాకా గ్లామర్ యాంగిల్ లోనే చూశారు. ఆమె నటిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో చూస్తారు అని అన్నారు.
Also Read : గణతంత్ర వేడుకల్లో సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొన్న పవన్.. ఫొటోలు
హీరో యోగేష్ కల్లె మాట్లాడుతూ.. త్రిముఖ హీరోగా నా ఫస్ట్ మూవీ. ఈ సినిమా తెరకెక్కించే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అడ్డంకులన్నీ దాటుకుని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నాం. సన్నీ లియోన్ మా సినిమాలో నటించడంతో ఆమెకు నటిగా మంచి పేరొస్తుంది. సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవకు ఇదే మొదటి తెలుగు సినిమా అని అన్నారు.