Tripti Dimri : బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన ‘యానిమల్’ భామ?

గతంలో మూడు సినిమాలు చేసినా రాని గుర్తింపు త్రిప్తి దిమ్రికి యానిమల్ ఒక్క సినిమాతో వచ్చింది.

Tripti Dimri gets offer from Aashiqui Sequel News goes Viral in Bollywood

Tripti Dimri : సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా వచ్చిన ‘యానిమల్’(Animal) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక కంటే కూడా ఎక్కువగా తృప్తి దిమ్రీ అనే హీరోయిన్ కి బాగా పేరొచ్చింది. యానిమల్ సినిమాతో త్రిప్తి దిమ్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాలో త్రిప్తి ఎమోషన్, రొమాన్స్ సన్నివేశాల్లో మెప్పించింది.

దీంతో త్రిప్తి దిమ్రికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కరోజులో మిలియన్స్ లో పెరిగిపోయారు. బయట ఎక్కడ కనపడినా ఫోటోల కోసం ఎగబడుతున్నారు జనాలు. గతంలో మూడు సినిమాలు చేసినా రాని గుర్తింపు త్రిప్తి దిమ్రికి ఈ ఒక్క సినిమాతో వచ్చింది. ఈ క్రమంలోనే పలు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా త్రిప్తి దిమ్రి గురించి ఓ అప్డేట్ బాలీవుడ్ లో వినిపిస్తుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మ్యూజికల్ మూవీ ఆషికీ(Aashiqui) మూవీ సీక్వెల్ లో త్రిప్తి దిమ్రిని తీసుకోవాలని భావిస్తున్నారట. 1990లో వచ్చిన ఆషికీ సినిమా సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా 2013లో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధ కపూర్ జంటగా ఆషికీ 2 సినిమా రాగా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ఆషికీ 3 సినిమాని తీసుకొస్తున్నారు. T సిరీస్ నిర్మాణంలో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఆషికీ 3 సినిమాని తీయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Also Read : Salaar : ‘సలార్’ సినిమా నుంచి యాక్షన్ ప్రోమో చూశారా?

అయితే ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని తీసుకుందామని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రిప్తి దిమ్రి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. త్రిప్తి పాపులారిటీ కూడా సినిమాకు వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒకవేళ ఇదే నిజమికైతే కనుక త్రిప్తి దిమ్రి భారీ ఆఫర్ అందుకున్నట్టే, ఆషికీ సినిమాపై కూడా అంచనాలు పెరిగినట్టే.