Trisha Krishnan: కుక్క ఫోటోతో కౌంటర్.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చిన త్రిష
తన గురించి వస్తున్న ట్రోలింగ్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన త్రిష(Trisha Krishnan).
- V Santhosh Kumar
- Updated on- June 2, 2026 / 04:17 PM IST
Trisha Krishnan solid counter to trolls with a dog photo
- త్రిష, విజయ్ రూమర్లపై సోషల్ మీడియా చర్చ.
- ఇన్‌స్టాగ్రామ్‌లో పెంపుడు కుక్క ఫోటో షేర్.
- నా విషయాల్లో తలదూర్చవద్దంటూ త్రిష కౌంటర్.
Trisha Krishnan: కోలీవుడ్ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మధ్య ఏదో ఉందంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో విజయ్, ఆయన భార్య సంగీతా స్వర్ణలింగం మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు రావడం.. ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు వీరిద్దరి వ్యక్తిగత జీవితాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
Sathish Javvaji: ఇది కదా ఆఫర్ అంటే.. నానితో సినిమా సెట్ చేసుకున్న ఈ డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఈ పుకార్లపై అటు విజయ్ కానీ, ఇటు త్రిష(Trisha Krishnan) కానీ ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు. అయితే, నిరంతరం తన వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టే వారికి త్రిష తాజాగా ఒక పరోక్షమైన, పదునైన సమాధానం ఇచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశాంతంగా నిద్రిస్తున్న తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టింది.
ఆ ఫోటో కింద త్రిష.. “నా విషయాల్లో తలదూర్చడానికి (ముక్కు పెట్టడానికి) నేను అనుమతించే ఒకే ఒక్క ముక్కు ఇదే..” అంటూ రాసుకొచ్చింది. ఆమె నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ, తనపై వస్తున్న రూమర్లకు, ట్రోలర్లకు కౌంటర్ గానే ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ క్రైప్టిక్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. మరి ఇకనైనా విజయ్, త్రిష గురించి వస్తున్న రూమర్స్ కి చెక్ పడుతుందా అనేది చూడాలి.
