Trivikram Srinivas Interesting Comments on NTR Devara Movie at Tillu Square Success Event
Trivikram : సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయం సాధించి ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది. దీంతో ఈ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు గెస్టులుగా వచ్చారు. దీంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఒకే స్టేజిపై కనపడేసరికి అభిమానులు సంతోషించారు.
ఇక నిన్నటి ఈవెంట్ కూడా చాలా సరదాగా సాగింది. అందరూ సరదా స్పీచ్ లతో మాట్లాడి ప్రేక్షకులని మెప్పించారు. ఎన్టీఆర్ ఈ సంవత్సరం దేవర సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో త్రివిక్రమ్ మొదట టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ గురించి, సిద్ధూ జొన్నలగడ్డ గురించి మాట్లాడి అనంతరం దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. రేపు ఉగాది. కొత్త సంవత్సరం. ఎన్టీఆర్ దేవరతో రాబోతున్నాడు. ఇది దేవర నామ సంవత్సరంగా మారుతుంది. టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు సాధించింది. దేవర దాని పక్కన ఇంకో సున్నా పెట్టుకొని 1000 కొట్టాలని నేను వయసులో ఎన్టీఆర్ కంటే పెద్దవాణ్ణి కాబట్టి ఆశీర్వదిస్తున్నాను అని అన్నారు. దీంతో త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్ ఫొటోలు..
ఇప్పటికే దేవర సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతుంది. RRR తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో దేవరతో మరో భారీ హిట్ కొడతాడని, త్రివిక్రమ్ అన్నట్టు 1000 కోట్లు సాధిస్తే ఇక ఎన్టీఆర్ కి పాన్ ఇండియా మార్కెట్ లో తిరుగుండదు అని అభిమానులు అంటున్నారు.