Trivikram Balakrishna
Trivikram Balakrishna : మాస్ హీరో బాలకృష్ణ – క్లాస్ దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఇక బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ ఫామ్ లో ఉండి వరుసగా అన్ని వంద కోట్ల సినిమాలతో దూసుకుపోతున్నారు. అసలు వీళ్లిద్దరి కాంబినేషన్ ని ఎవరూ ఊహించలేరు. కానీ ఒకానొక సమయంలో వీరిద్దరూ కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చిందట.(Trivikram Balakrishna)
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా డైరెక్టర్ విజయ్ భాస్కర్ దగ్గర చాలా సినిమాలకు పనిచేసారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, నువ్వే కావాలి, స్వయంవరం,మన్మధుడు.. ఇలా సూపర్ హిట్ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేసారు. అలాంటి టైంలో విజయ్ భాస్కర్ కి బాలయ్యతో సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందట. దానికి కూడా త్రివిక్రమ్ రచయితగా చేయాల్సింది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది.
Also See : Varun Sandesh : అయ్యప్ప మాల వేసుకున్న హీరో వరుణ్ సందేశ్.. ఆలయంలో ఫొటోలు..
బాలకృష్ణ లారీ డ్రైవర్ సినిమాకు విజయ్ భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఆ సినిమాకు విజయ్ భాస్కర్ పడిన కష్టం చూసి బాలయ్య ఆయనతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. 2003లో బాలయ్య ఫోన్ చేసి మరీ విజయ్ భాస్కర్ ని కథ రెడీ చేసుకో సినిమా చేద్దాం అన్నారట. అప్పుడు విజయ్ భాస్కర్ మల్లీశ్వరి సినిమా వర్క్ లో బిజీగా ఉన్నారు. దాంతో అప్పుడు విజయ్ భాస్కర్ కి కుదరలేదు. బాలయ్య కూడా ఆ తర్వాత వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. దీంతో త్రివిక్రమ్ రచయితగా బాలయ్య సినిమాకు పని చేసే అవకాశం మిస్ అయింది.
ఇప్పుడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఫామ్ లో లేరు. అడపాదడపా ఏవో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడైతే బాలయ్య ఉన్న రేంజ్ కి విజయ్ భాస్కర్ తో సినిమా చేసే అవకాశమే లేదు. రచయిత నుంచి త్రివిక్రమ్ దర్శకుడిగా మారి స్టార్ డైరెక్టర్ అయ్యారు. మరి భవిష్యత్తులో త్రివిక్రమ్ బాలయ్యతో సినిమా చేస్తారా? చేస్తే త్రివిక్రమ్ రాసే క్లాస్ డైలాగ్స్ ఇప్పుడున్న బాలయ్య మాస్ స్టార్ డమ్ కి ఎలా చెప్తారు అనేది చూడాలి. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సమేత లాంటి మాస్ సినిమా తీసినా అందులో క్లాస్ డైలాగ్స్ కూడా చాలానే ఉంటాయి. కాబట్టి బాలయ్యతో అవకాశం వచ్చినా త్రివిక్రమ్ డీల్ చేస్తారనే అనుకుంటున్నారు. మరి బాలయ్యతో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా లేదా చూడాలి.
Also Read : Mamitha Baiju : డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఏం చదువుతుందో తెలుసా? కృతిశెట్టి లాగే..