Mamitha Baiju : డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఏం చదువుతుందో తెలుసా? కృతిశెట్టి లాగే..

డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి తెలిపింది. (Mamitha Baiju)

Mamitha Baiju : డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఏం చదువుతుందో తెలుసా? కృతిశెట్టి లాగే..

Mamitha Baiju

Updated On : October 22, 2025 / 9:40 AM IST

Mamitha Baiju : మలయాళం హీరోయిన్ మమిత బైజు ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయిన ఈ భామ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. మమిత బైజు ఇటీవలే ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Mamitha Baiju)

డ్యూడ్ సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించగా తెలుగులో యావరేజ్ గా నిలిచింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేశారు. డ్యూడ్ హీరోయిన్ మమిత బైజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి తెలిపింది.

Also Read : Allu Aravind : సినిమా షూట్ లో ఉండగానే ఇంకో సినిమా.. కన్నడ హీరోకు అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్..

మమిత బైజు మాట్లాడుతూ.. మా నాన్న డాక్టర్. నేను కూడా మెడిసిన్ చదవాలి అనుకున్నాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అప్పటికి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నా. కరోనా సమయంలో బ్రేక్ రావడంతో సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశా. సినిమాలను ఎక్కువ ఇష్టపడ్డా. అప్పుడు ఆలోచించి సినిమాలే చేస్తాను అని ఇంట్లో ఒప్పించాను. కానీ మొత్తం స్టడీ వదలకూడదు కాబట్టి సైకాలజీ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ప్రేమలు రిలీజయి హిట్ అయి వరుస ఛాన్సులు వస్తున్నాయి. దాంతో బిజీగా ఉండి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. మళ్ళీ చదివి సైకాలజీ డిగ్రీ పూర్తి చేస్తాను. త్వరలో పూర్తవుతుంది అని తెలిపింది.

హీరోయిన్ కృతిశెట్టి కూడా సైకాలజీలో డిగ్రీ చేస్తున్నాను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కృతి లాగే ఇప్పుడు మమిత బైజు కూడా సైకాలజీలో డిగ్రీ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Mamitha Baiju (@mamitha_baiju)

Also Read : Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ హీరోయిన్ ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా? ఆ సూపర్ హిట్ సినిమాలో చాలా చిన్న పాత్ర..