Allu Aravind : సినిమా షూట్ లో ఉండగానే ఇంకో సినిమా.. కన్నడ హీరోకు అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్..

తాజాగా స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కన్నడ హీరోకు అడ్వాన్స్ ఇచ్చారట. (Allu Aravind)

Allu Aravind : సినిమా షూట్ లో ఉండగానే ఇంకో సినిమా.. కన్నడ హీరోకు అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్..

Allu Aravind

Updated On : October 22, 2025 / 9:14 AM IST

Allu Aravind : నిర్మాతలు అప్పుడప్పుడు హీరో, హీరోయిన్స్, దర్శకులకు ముందే అడ్వాన్స్ లు ఇచ్చేసి వాళ్ళతో సినిమాలు చేస్తామని చెప్తారు. తాజాగా స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కన్నడ హీరోకు అలా అడ్వాన్స్ ఇచ్చారట. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే ఇంకో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేస్తానని చెప్పారట. ఏకంగా గీత ఆర్ట్స్ లో ఇలా అడ్వాన్స్ తీసుకున్నాడు అంటే గ్రేట్ అని టాలీవుడ్ లో చర్చిస్తున్నారు.

ఇంతకు ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా? కన్నడ హీరో దీక్షిత్ శెట్టి. కన్నడలో సీరియల్స్ తో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ హీరోగా మారాడు. గతంలో కన్నడ దియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా తెలుగులో దసరా సినిమాలో నాని ఫ్రెండ్ పాత్రలో నటించి తెలుగు వాళ్ళను మరింత మెప్పించాడు. ఇప్పుడు దీక్షిత్ శెట్టి రష్మికకు జంటగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తున్నాడు.

Also Read : Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ హీరోయిన్ ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా? ఆ సూపర్ హిట్ సినిమాలో చాలా చిన్న పాత్ర..

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో సినిమా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తావన రాగా దీక్షిత్ శెట్టి ఆసక్తికర విషయం చెప్పారు.

దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా కొంత షూటింగ్ అయ్యాక అల్లు అరవింద్ గారు మా రషెస్ చూసారు. ఏమంటారో అనుకున్నాను. కానీ ఈ సినిమా షూటింగ్ లో ఉండాగానే ఇదే బ్యానర్ లో నాతో ఇంకో సినిమా చేస్తాను అని అడ్వాన్స్ కూడా ఇచ్చారు అని తెలిపారు. దీంతో గీత ఆర్ట్స్ బ్యానర్ లో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి దీక్షిత్ కి ఎవరు కథ చెప్పి ఒప్పిస్తారో, గీత ఆర్ట్స్ లో చేసే ఛాన్స్ ఏ డైరెక్టర్ కి వస్తుందో చూడాలి. ఏదేమైనా కన్నడ హీరోకి గీత ఆర్ట్స్ లాంటి సినిమాలో సినిమా రిలీజవ్వకముందే ఇంకో సినిమా ఛాన్స్ వచ్చింది అంటే గ్రేట్ అని చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Dheekshithh Shetty (@dheekshithshettyofficial)

Also See : Priyanka Chopra : అమెరికాలో ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..