Trivikram Srinivas Praises Allu Arjun in Balakrishna Unstoppable Show
Trivikram – Allu Arjun : అల్లు అర్జున్ తాజాగా బాలయ్య ఆహా అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్ గా వచ్చాడు. ఈ ఎపిసోడ్ నేటి నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. అయితే అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ముఖ్యమైన వాళ్ళతో వీడియో బైట్స్ తీయించి షోలో ప్లే చేసారు బాలయ్య. ఈ వీడియోల్లో అల్లు అర్జున్ గురించి రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, దిల్ రాజు, గుణశేఖర్ మాట్లాడారు.
ఈ క్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను జులాయి సినిమా మొదలు పెట్టినపుడు బన్నీతో మొదటిసారి మాట్లాడినప్పుడే అతనితో నా జర్నీ ఇంకా కొనసాగుతుంది అనిపించింది. సినిమా సినిమాకు ఆయన స్టార్ డమ్ విపరీతంగా పెరగడమే కాదు వ్యక్తిగా కూడా బాగా ఎదిగాడు. ఇప్పుడు బన్నీ దిష్టి తగిలేంత గొప్పోడు అయిపోయాడు పుష్ప తర్వాత. భారత విజయాల జాబితాకు ఒక డైరెక్టరీ ఉంటే అందులో మొదటి వరుసలో బన్నీ ఉంటాడు. ప్రస్తుతం ఆయన నటన చెయ్యట్లేదు. తపస్సు చేస్తున్నారు. లాస్ట్ ఓ నాలుగేళ్ళ నుంచి ఆ తపస్సు చేస్తున్నాడు బన్నీ. ఆయన కంటే పెద్దవాడిని కాబట్టి బన్నీని ఆశీర్వదిస్తున్నాను. ఆయన మిత్రుడిగా అంతర్జాతీయ వేడుకలపై మా అందర్నీ తీసుకెళ్లాలని అభినందిస్తున్నాను అని అన్నారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ థమ్సప్ యాడ్ చూసారా?
ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ మాటలకూ స్పందిస్తూ.. నా లైఫ్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చింది త్రివిక్రమ్. నాకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారు. నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అల వైకుంఠపురంలో ఇచ్చారు అని అన్నారు. దీంతో బాలయ్య నాకు బోయపాటి ఎలాగో నీకు త్రివిక్రమ్ అలా అని అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.