Trivikram : పవన్ గెలుపు.. తిరుమలకు కాలి నడకన త్రివిక్రమ్.. త్రివిక్రమ్ తనయుడిని చూశారా?

తాజాగా త్రివిక్రమ్ తన భార్య, తనయుడుతో కలిసి తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గం నుండి కాలి నడకన వెళ్లారు.

Trivikram Srinivas : ఇటీవల ఏపీ ఎన్నికల్లో పవన్ భారీ విజయం సాధించి, తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకొని డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ విజయాల పట్ల అభిమనులు, కార్యకర్తలతో పాటు సినీ పరిశ్రమ, పవన్ సన్నిహితులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. పవన్ గెలుపును సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల పవన్ గెలిచినందుకు సాయి ధరమ్ తేజ్ తిరుమలకు కాలి నడకన వెళ్లి మొక్కు తీర్చుకున్నారు.

Also Read : Nikhil – Varun Sandesh : ‘హ్యాపీడేస్’ రోజులు గుర్తొచ్చేలా.. వరుణ్ సందేశ్ కోసం నిఖిల్..

తాజాగా త్రివిక్రమ్ తన భార్య, తనయుడుతో కలిసి తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గం నుండి కాలి నడకన వెళ్లారు. నడక దారిలో త్రివిక్రమ్ వీడియోలు వైరల్ గా మారాయి. ఇవాళ ఉదయం VIP దర్శన సమయంలో త్రివిక్రమ్ స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో నడిచి వెళ్లగా త్రివిక్రమ్ తనయుడు కూడా వైరల్ అవుతున్నాడు. త్రివిక్రమ్ భార్య సౌజన్య పలుమార్లు కనిపించినా పిల్లలు మాత్రం అసలు కనిపించరు. ఇప్పుడు త్రివిక్రమ్ కొడుకు రిషి మంచి హైట్, కళ్ళజోడు పెట్టుకొని, నాన్న పోలికలతో కనిపించడంతో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ ఫ్యామిలీ డివోషనల్ ట్రిప్ వైరల్ గా మారింది.

అయితే త్రివిక్రమ్ కి పవన్ క్లోజ్ ఫ్రెండ్ అని తెలిసిందే. దీంతో పవన్ గెలిచినందుకే త్రివిక్రమ్ తిరుమలకు వెళ్లాడని పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నేడు అక్కడి లోకల్ మీడియా త్రివిక్రమ్ దర్శనం అయ్యాక పవన్ గెలుపు గురించి మాట్లాడించాలని ఎదురుచూస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు