Vijaya Durga : అతని వల్లే రవళికి సినిమా ఛాన్స్‌లు ఆగిపోయాయట.. రవళి తల్లి ఏం చెప్పారంటే?

నటి రవళిని తెలుగువారు మర్చిపోరు. వెండితెరపై ఆమె కనిపిస్తే చూడాలని ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. రవళి సినిమాలు మానేయడానికి కారణం ఏంటి?

Vijaya Durga : అతని వల్లే రవళికి సినిమా ఛాన్స్‌లు ఆగిపోయాయట.. రవళి తల్లి ఏం చెప్పారంటే?

Vijaya Durga

Vijaya Durga : మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ.. అంటూ పెళ్లి సందడి సినిమాలోని పాట వినపడగానే నటి రవళి కళ్లముందు కదులుతారు. రవళి సిల్వర్ స్క్రీన్‌కి దూరమై చాలా సంవత్సరాలు కావొస్తుంది. మళ్లీ ఆ నటిని చూడాలని ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. అసలు రవళి సినిమాలకు దూరమవ్వడానికి కారణం ఏంటి? రవళి తల్లి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Daggubati Raja : వెంకటేష్ తమ్ముడు సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు.. చాలా గ్యాప్ తర్వాత ‘స్కంద’తో..

90 లలో హీరోయిన్ గా రవళి తెలుగు సినిమాల్లో ఎంతటి పేరు తెచ్చుకున్నారో ఆమె సిస్టర్ హరిత కూడా టీవీ రంగంలో అంతటి పాపులారిటీ సంపాదించుకున్నారు. రవళి మొదట మళయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినా తెలుగులో ఈవీవీ సత్యనారాయణ సినిమా ‘ఆలీబాబా అరడజను దొంగలు’ సినిమాతో పరిచయం అయ్యారు. ఆ తరువాత ‘పెళ్లి సందడి’ సినిమాతో రవళికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఒరేయ్ రిక్షా, వినోదం, పెళ్లి సందడి, శుభాకాంక్షలు ఇలా సినిమాలు చేస్తూ మధ్యలో బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత స్టాలిన్‌తో రీ ఎంట్రీ ఇచ్చి.. ‘బాస్’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి.. ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించిన రవళి ఆ తర్వాత తెరకు దూరమయ్యారు.

Madam Chief minister : ‘మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌’.. కొత్త లేడి ఓరియెంటెడ్ సినిమా ప్రారంభం..

రవళి సినిమాలకు దూరమవ్వడానికి కారణం ఓ జర్నలిస్టు అంటూ ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె తల్లి విజయదుర్గ చెప్పారు. రవళి బాగా లావైపోయిందని.. అవకాశాలు అందుకే తగ్గిపోయాయని అతని రాసిన రాతల ప్రభావం వల్లే రవళికి సినిమాలు ఆగిపోయాయని చెప్పారావిడ. రవళి నటిస్తే చూడాలని ఉందని సోషల్ మీడియాలో తనని చాలామంది అడుగుతుంటారని మా అందరి సజెషన్‌తో రవళి డైటింగ్ స్టార్ట్ చేసిందని చెప్పుకొచ్చారావిడ. మళ్లీ పాత రవళిని 2024 లో స్క్రీన్ మీద చూడబోతున్నారని చెప్పారు. సో.. రవళిని మళ్లీ తెరపై చూడాలని తహతహలాడుతున్న అభిమానులు 2024 వరకూ వెయిట్ చేయాల్సిందే.