Tunnel : తల్లి అయిన తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి మొదటి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమా ఇటీవల తమిళ్ లో రిలీజయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. (Tunnel)

Tunnel

Tunnel : మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ లో సందడి నెలకొంది. లావణ్య తల్లి అయినా తర్వాత తను హీరోయిన్ గా నటించిన ఓ సినిమా రిలీజ్ కాబోతుంది.(Tunnel)

అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన సినిమా ‘టన్నెల్’. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల తమిళ్ లో రిలీజయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

Also See : Varun Tej Lavanya Tripathi : మెగా వారసుడొచ్చాడు.. తండ్రి అయిన వరుణ్ తేజ్.. ఆనందంలో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు..

టన్నెల్ సినిమా ఇప్పుడు తెలుగులో సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. రవీంద్ర మాధవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ.రాజు నాయక్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇటీవలే తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ గా సాగిన టన్నెల్ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి నెలకొంది.

 

Also Read : Jabardasth Mahidhar : వామ్మో.. జబర్దస్త్ నటుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించాడో తెలుసా? దాంతో వైజాగ్ లో కొత్త బిజినెస్..