బ్రేకింగ్.. టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్

సంచలనం రేపుతున్న టీవీ నటి శ్రావణ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రావణి సూసైడ్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణి సూసైడ్ కు కారణం అంటూ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి సోమవారం విచారణకు హాజరు కానున్నారు. అరెస్టు చేసిన వారిని సోమవారం(సెప్టెంబర్ 14,2020) రిమాండ్ కు తరలించనున్నారు. అలాగే శ్రావణి తల్లిదండ్రుల వాంగ్మూలం రికార్డు చేశారు పోలీసులు.
శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు ఇద్దరిని విచారించారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. శ్రావణి కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణం అని సాయికృష్ణారెడ్డి ఆరోపించాడు. సాయికృష్ణారెడ్డి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ ఆరోపించాడు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
దేవరాజ్ అసలు విలన్ అని, అతడి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబసభ్యులు సైతం ఆరోపించారు. దేవరాజ్ కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందన్నారు.
పూటకో ట్విస్ట్.. గంటకో ఆడియో, వీడియో లీక్స్‌తో మిస్టరీని తలపిస్తున్న నటి శ్రావణి కేసును ఓ కొలిక్కి తెస్తున్నారు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయి, ఆశోక్ రెడ్డిలను ఇప్పటికే పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించారు.
టీవీ నటి శ్రావణి చావుకు కారకులెవరు..? దేవరాజ్ రెడ్డా.. లేక సాయి రెడ్డా..? అసలు RX 100 నిర్మాత పేరెందుకు వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలతో శ్రావణి సూసైడ్ కేసు క్రైమ్ సీరియల్‌ను తలపించింది. రోజుకో ట్విస్టుతో పోలీసులకే పిచ్చెక్కించింది. తొలుత దేవరాజ్‌ను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్ అందించిన ఆధారాలతో ఇప్పుడు.. కేసు మొత్తం సాయి మెడకు చుట్టుకుంది. హోటల్‌లో గొడవ జరిగిన రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదట దేవరాజ్ చుట్టూ కేస్ తిరిగితే.. ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో పోలీసులకు కీలకమైన సాక్ష్యాలు అందించాడు. ముగ్గురిని విచారించిన పోలీసులు చివరికి, శ్రావణి సూసైడ్ కు కారణం అంటూ ముగ్గురినీ అరెస్ట్ చేయడం మరో పెద్ద ట్విస్ట్.