TV Producers : తెలుగు టెలివిజన్ డిజిటల్ & ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..
2025– 2027వ సంవత్సరానికి గాను తాజాగా ‘తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది.(TV Producers)

TV Producers
TV Producers : 2025– 2027వ సంవత్సరానికి ‘తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా ఏ.ప్రసాదరావు (సోనోపిక్స్ ప్రసాద్), వైస్ ప్రెసిడెంట్‌గా పి.ప్రభాకర్, యన్.అశోక్‌లు ఎన్నికవ్వగా జనరల్ సెక్రటరీగా యం.వినోద్‌బాల జాయింట్ సెక్రటరీలుగా నటుడు, నిర్మాత కె.వి శ్రీరామ్, గుత్తా వెంకటేశ్వరరావు, ట్రెజరర్‌గా డి.వై చౌదరి ఎన్నికయ్యారు.(TV Producers)
14 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సభ్యులకు ఉపయోగపడే విధంగా పనులు చేసి అందరితో శభాష్ అనిపించుకునే ఏకైక యూనియన్ మాది అని ప్రెసిడెంట్ ప్రసాద్‌రావు అన్నారు. ఎలాంటి ఎన్నికల హడావిడి లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకుంటున్న ఏకైక యూనియన్ మా టిటిడిఓపిసి సంస్థ అని తెలిపారు జనరల్ సెక్రటరీ వినోద్‌బాల.
Also Read : Pawan Kalyan : OG రిలీజ్ కి ముందు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు..
ఈ కౌన్సిల్‌లో దాదాపు 200 మంది నిర్మాతలు ఉన్నారు. అందరూ యాక్టివ్‌గా ఉంటూ వందలమందికి ఉపాధి కల్పించటంలో అనేక యూనియన్ల కంటే సౌతిండియాలోనే అతి పెద్ద సంస్థ మాది అన్నారు నటుడు, నిర్మాత ఈటీవి ప్రభాకర్. మా యూనియన్‌కి సొంత భవనంతో పాటు కొన్ని స్థిరాస్తులు ఉండటంతో మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మా యూనియన్ సభ్యులు అని తెలిపారు ట్రెజరర్ డి.వి చౌదరి.
మా యూనియన్ సభ్యులకి ఎలాంటి ఆపద వచ్చినా అందమా కలిసి కట్టుగా మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటామని, అందుకే మాలో వివాదాలు ఉండవని అన్నారు నటుడు, నిర్మాత కె.వి శ్రీరామ్.
Also See : National Awards : నేషనల్ అవార్డులు అందుకున్న గ్రహీతలు.. టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే..