Odisha Vakeel saab : వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఒడిషాలో రెండు థియేటర్లు సీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది.

Odisha Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతోంది. వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 1200 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. పవన్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కాగా, వకీల్ సాబ్ సినిమా చూసేందుకు ఒడిశాలో పవన్ అభిమానులు భారీగా స్థానిక థియేటర్లకు పోటెత్తుతున్నారు. కరోనా ఆంక్షలను కూడా లెక్క చెయ్యడం లేదు. దీంతో అధికారులు కొరడా ఝళిపించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని రెండు సినిమా థియేటర్లపై చర్యలు తీసుకున్నారు. గజపతి జిల్లా పర్లాఖిముడిలో రెండు థియేటర్లలో వకీల్ సాబ్ విడుదలైంది.

సినిమాను చూసేందుకు ఆదివారం(ఏప్రిల్ 11,2021) పవన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో సినిమా హాళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో సినిమా హాళ్ల యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరించాయని ఆరోపిస్తూ పర్లాఖిముడిలోని థియేటర్లపై జిల్లా అధికారులు చర్యలకు దిగారు. నిబంధనలు పాటించని రెండు సినిమా హాళ్లకు తాత్కాలికంగా సీల్‌ వేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్‌ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అసలే దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ లో కరోనా రెచ్చిపోతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనాతో గేమ్స్ అంటే.. ప్రాణాలను రిస్క్ లో వేసినట్టే. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు. సినిమా ఈ రోజు కాకపోతే మరో రోజు చూడొచ్చు. కానీ, ప్రాణం పోతే మళ్లీ రాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు