Nuvvu Nenu : వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. ‘నువ్వు నేను’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

ఉదయ్ కిరణ్ ని మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం వచ్చింది. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది.

Uday Kiran Nuvvu Nenu Movie Re Releasing Bookings Open

Nuvvu Nenu : చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఒకప్పుడు యూత్ లో మంచి స్థానం సంపాదించుకున్న ఉదయ్ కిరణ్(Uday Kiran) అనుకోకుండా ఆత్మహత్య చేసుకొని మనకు దూరమయ్యారు. ఆయన దూరమైనా సినిమాలు, పాటల రూపంలో ఇప్పటికి తలుచుకుంటూనే ఉంటాము. ఎప్పటికి నిలిచిపోయే పాటలు, సినిమాలు మనకు అందించారు ఉదయ్ కిరణ్.

ఇప్పుడు ఉదయ్ కిరణ్ ని మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం వచ్చింది. ఉదయ్ కిరణ్ రెండో సినిమా, అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. ఇటీవల ఒకప్పటి క్లాసిక్ సినిమాలని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా కూడా రీ రిలీజ్ కానుంది.

Also Read : Premikudu : రీ రిలీజ్ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభుదేవా ‘ప్రేమికుడు’ గ్రాండ్ రీ రిలీజ్..

ఉదయ్ కిరణ్, అనిత జంటగా తేజ దర్శకత్వంలో, ఆర్పీ పట్నాయక్ అద్భుతమైన సంగీతంలో తెరెక్కిన ఈ సినిమా 2001వ సంవత్సరం ఆగస్టు 10న రిలీజయి అప్పట్లో భారీ విజయం సాధించింది. ఏకంగా 5 నంది అవార్డులు అందుకున్నారు ఈ సినిమాతో. ఇప్పుడు ఈ సినిమా మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఆన్లైన్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులు మరోసారి థియేటర్లో తమ హీరోని చూడటానికి ఎదురుచూస్తున్నారు. నువ్వు నేను రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.

 

ట్రెండింగ్ వార్తలు