Uday Raj Vaishnavee Singh Madhuram Movie Release Date Announced
Madhuram : ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మధురం. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యం.బంగార్రాజు నిర్మాణంలో రాజేష్ చికిలే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎ మెమొరబుల్ లవ్ అనేది సినిమా ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
Also Read : Chiranjeevi – Sivaji : మెగాస్టార్ ని మెప్పించిన శివాజీ.. ‘మంగపతి’ని ఇంటికి పిలిచి.. ఫొటోలు వైరల్..
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మధురం సినిమా ఏప్రిల్ 18న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు నిర్మాత. ఇది క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అన్నారు.
డైరెక్టర్ రాజేష్ చికిలే మాట్లాడుతూ.. 1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చుపిస్తాము. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది అని తెలిపారు. నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ.. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నాం. నితిన్ గారు రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది అని అన్నారు.