Chiranjeevi – Sivaji : మెగాస్టార్ ని మెప్పించిన శివాజీ.. ‘మంగపతి’ని ఇంటికి పిలిచి.. ఫొటోలు వైరల్..
శివాజీని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిచి అభినందించారు.

Megastar Chiranjeevi Appreciated Sivaji after Watching Court Movie
Chiranjeevi – Sivaji : ఒకప్పుడు హీరోగా, కీ రోల్స్ తో మెప్పించిన శివాజీ మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవలే వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో మళ్ళీ బిజీ అవ్వగా కోర్ట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. నాని నిర్మాణంలో తెరకెక్కిన కోర్ట్ సినిమాలో శివాజీ విలన్ గా నటించారు. ఒక్క చుక్క రక్తం కూడా రాకుండా, ఒక్క ఫైట్ కూడా లేకుండా కేవలం మాటలు, చూపులతోనే అందర్నీ భయపెట్టారు.
కోర్ట్ సినిమాలో శివాజీ నటించిన మంగపతి పాత్ర బాగా పేలింది. అందరూ ఆ పాత్రకి కనెక్ట్ అయ్యారు. కోర్ట్ సినిమాతో శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా మొదలైంది. ఇప్పటికే శివాజీని అందరూ పొగిడేశారు. శివాజీ కూడా తన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంచి సినిమాలను, బాగా నటించిన వాళ్ళను చిరంజీవి పిలిచి అభినందిస్తారని తెలిసిందే. ఇప్పుడు శివాజీని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిచి అభినందించారు.
శివాజితో మాట్లాడి మంగపతి పాత్రని పొగిడి ఆ పాత్రలో జీవించావు అని అభినందించారు. మెగాస్టార్ పిలిచి అభినందించడంతో శివాజీ ఉబ్బితబ్బిబయ్యాడు.
మెగాస్టార్ తో సెల్ఫీలు తీసుకొని తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చిరంజీవితో శివాజీ సెల్ఫీలు తీసుకున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
శివాజీ గతంలో చిరంజీవి మాస్టర్, ఇంద్ర సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ సినిమా వాయిదా.. సారీ చెప్తూ మంచు విష్ణు పోస్ట్..
View this post on Instagram