Kannappa : ‘కన్నప్ప’ సినిమా వాయిదా.. సారీ చెప్తూ మంచు విష్ణు పోస్ట్..
తాజాగా ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు మంచు విష్ణు క్షమాపణలు చెప్తూ అధికారికంగా పోస్టు చేసాడు.

Manchu Vishnu Says Officially Kannappa Movie Postponed
Kannappa : మంచు విష్ణు త్వరలో ‘కన్నప్ప’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ తాజాగా ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు మంచు విష్ణు క్షమాపణలు చెప్తూ అధికారికంగా పోస్టు చేసాడు.
Also Read : Sitara Ghattamaneni : ఓ షాప్ ఓపెనింగ్ కి సితార పాప.. ఉగాది నాడు.. ఏ టైంకి? ఎక్కడో తెలుసా?
మంచు విష్ణు తన పోస్ట్ లో.. కన్నప్ప సినిమాని తీసుకురావడం ఒక అద్భుతమైన ప్రయాణం. మేము హై స్టాండర్డ్స్ ఉన్న ఒక మంచి అవుట్ ఫుట్ ని డెలివరీ చేయడానికి చూస్తున్నాము. అందుకోసం ఇంకొన్ని వారాలు సమయం పడుతుంది. కొన్ని VFX వర్క్స్ ఇంకా బెటర్ చేస్తున్నాము. అందుకే సినిమా రిలిజ్ కి కొంత సమయం పడుతుంది. కన్నప్ప సినిమా శివుడికి మేమిచ్చే గిఫ్ట్ లాంటిది. అందుకే బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాము. సినిమా వాయిదా పడుతున్నందుకు అర్ధం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. మా టీమ్ సినిమా మీదే పని చేస్తుంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాము అని తెలిపారు.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025
ఇప్పటికే కన్నప్ప సాంగ్స్, టీజర్స్ రిలీజయ్యాయి. విష్ణు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు, పాన్ ఇండియా ప్రెస్ మీట్స్ నిర్వహించారు. ఈ పోస్ట్ తో కన్నప్ప సినిమా వాయిదా పడినట్టు మంచు విష్ణు క్లారిటీ ఇచ్చేసారు. మరి తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. విష్ణు కన్నప్ప సినిమాని వాయిదా వేయడంతో మంచు మనోజ్ భైరవం సినిమా ఆ డేట్ కి వచ్చే అవకాశం ఉంది.
Also Read : Naga Chaitanya : పెళ్లయ్యాక మరో కొత్త బిజినెస్ మొదలుపెట్టిన నాగచైతన్య.. ఈసారి కూడా అదే..
ఇక కన్నప్ప సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.