Naga Chaitanya : పెళ్లయ్యాక మరో కొత్త బిజినెస్ మొదలుపెట్టిన నాగచైతన్య.. ఈసారి కూడా అదే..
షోయు క్లౌడ్ కిచెన్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు పెళ్లి తర్వాత మరో బిజినెస్ మొదలుపెట్టాడు చైతు.

Naga Chaitanya Started another Food Business after Marriage
Naga Chaitanya : అక్కినేని వారసుడు నాగ చైతన్య ఇటీవలే తండేల్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. చైతు గత డిసెంబర్ లోనే శోభితని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత తండేల్ బిజీతో ఉన్న చైతు ఇటీవలే కాస్త టైం దొరకడంతో భార్యతో వెకేషన్ కి వెళ్ళాడు.
సినిమా స్టార్స్ అంతా సినిమాలు చేస్తూనే ఏదో ఒక బిజినెస్ లో పెట్టుబడులు పెడతారు, బిజినెస్ లు నడిపిస్తారు. నాగచైతన్య ఇప్పటికే పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టగా గతంలో కరోనా సమయంలో షోయు అనే క్లౌడ్ కిచెన్ స్థాపించి సొంతంగా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. ప్రపంచంలోని పలు దేశాల్లో దొరికే ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. ఈ క్లౌడ్ కిచెన్ నుంచి కేవలం ఆన్లైన్ లో మాత్రమే డెలివర్ చేస్తారు. షోయు క్లౌడ్ కిచెన్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు పెళ్లి తర్వాత మరో బిజినెస్ మొదలుపెట్టాడు చైతు.
Also Read : Ram Charan : రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. నాగ్, చిరు స్పెషల్ అట్రాక్షన్.. ఫొటోలు వైరల్..
ఈసారి కూడా నాగచైతన్య మళ్ళీ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈసారి స్కుజి అనే పేరుతో మరో ఫుడ్ క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. స్కుజి టీ షర్ట్ వేసుకొని ఆ కిచెన్ లో దిగిన పలు ఫొటోలు, వాళ్ళు తయారుచేసిన పలు ఫుడ్ ఫొటోలు షేర్ చేసి నాగచైతన్య అధికారికంగా ఈ విషయాన్ని తెలిపాడు.
నాగచైతన్య తన సోషల్ మీడియాలో.. ప్రపంచం అంతా తిరిగాకా చాలా చోట్ల ఫుడ్ తిన్నాకా అందులో కొన్ని నా ఫేవరేట్ అయి, నా లైఫ్ లో భాగం అయ్యాయి. ఆ ఫుడ్ మీద ఇష్టంతోనే షోయు ని ప్రారంభించాను. దాన్ని మీరు సక్సెస్ చేసారు. మీరిచ్చిన ప్రేమతో ఇప్పుడు స్కుజి ని మొదలుపెడుతున్నాను. ట్రెడిషినల్ ఫుడ్స్, కంఫర్ట్ ఫుడ్ హార్ట్ తో సర్వ్ చేస్తాము ఇక్కడ. ఇది కూడా క్లౌడ్ కిచెన్. మీరు కూడా ఈ స్కుజి ఫుడ్ ని ఆనందిస్తారని అనుకుంటున్నాను అంటూ తన కొత్త బిజినెస్ గురించి పోస్ట్ చేసాడు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు చైతూకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు.
గతంలో పలుమార్లు నాగచైతన్య నాకు ఫుడ్, వంట చేయడం ఇష్టం. ఒక రెస్టారెంట్ పెట్టాలని ఉందని, రిటైర్ అయ్యాక ఒక రెస్టారెంట్ పెట్టుకొని దాన్ని నడపాలని ఉందని తెలిపాడు. మరి ఫ్యూచర్ లో చైతు ఇంకెన్ని ఫుడ్ బిజినెస్ లు మొదలుపెడతాడో చూడాలి.