NTR – Pradeep : ఎన్టీఆర్ – ప్రదీప్ ఇంత క్లోజా..? మలేషియాకు తీసుకెళ్లి.. ఎన్టీఆర్ తల్లికి ప్రదీప్ అంటే ఎంత ఇష్టమో..
తాజాగా ప్రదీప్ యాంకర్ సుమ చాట్ షోకి వచ్చాడు.

Anchor Pradeep Revealed How NTR Close to Him in Anchor Suma Show
NTR – Pradeep : యాంకర్ ప్రదీప్ కొన్నాళ్ల పాటు టీవీలో స్టార్ యాంకర్ గా అందర్నీ మెప్పించాడు. అనేక టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరయి, ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. మొదట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా రాగా కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తన రెండో సినిమాతో వస్తున్నాడు ప్రదీప్.
ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ప్రదీప్ యాంకర్ సుమ చాట్ షోకి వచ్చాడు. ఈ షోలో అనేక అంశాలు మాట్లాడాడు. ఈ క్రమంలో పలువురు హీరోలు, హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడారు.
Also Read : Pradeep Machiraju : ఒకసారి సర్జరీ ఫెయిల్ అయింది.. మళ్ళీ సర్జరీ.. అందుకే.. యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు వైరల్..
ఎన్టీఆర్ ప్రస్తావన రాగా ప్రదీప్.. ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమాలో నటించాను. ఆఫ్ సెట్స్ ఆయన హ్యూమర్ చాలా బాగుంటుంది. నాకు షూట్ లేకపోయినా, అది సాంగ్ షూట్ అయినా మూవీ వాళ్లకు చెప్పి నన్ను మలేషియా తీసుకెళ్లారు. అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. ఎన్టీఆర్ అన్న చాలా సరదాగా, అల్లరిగా ఉంటారు. మలేషియాకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ అన్న.. మా అమ్మగారు మీ షో చూస్తారు ప్రదీప్. టీవీలో నీ వాయిస్ వినిపిస్తే వంటింట్లో ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. నీ షోలు చూస్తారు అని చెప్పారు. అప్పట్నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయనవి ఏ షూటింగ్ జరిగినా నేను వెళ్తాను. ఆయనతో కబుర్లు చెప్తాను. ఆయనతో కాస్త సమయం గడుపుతాను. నాకు ఆ చనువు ఉంది ఆయన దగ్గర అని తెలిపాడు ప్రదీప్.
Also Read : NTR – Naga Chaitanya : జపాన్ లో నాగచైతన్యని తెగ పొగిడేసిన ఎన్టీఆర్.. మై డియర్ ఫ్రెండ్ అంటూ.. వీడియో వైరల్..
దీంతో ఎన్టీఆర్ – ప్రదీప్ ఇంత క్లోజా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. ఎన్టీఆర్ ఢీ షోకి గెస్ట్ గా వచ్చినప్పుడు ప్రదీప్ కాళ్ళ మీద కూర్చొని ఎన్టీఆర్ ఒక క్యూట్ ఫోటో దిగారు. అప్పట్లో ఆ ఫోటో బాగా వైరల్ అయింది. అది తన మెమరబుల్ మూమెంట్ అని చెప్పాడు ప్రదీప్.