Pradeep Machiraju : ఒకసారి సర్జరీ ఫెయిల్ అయింది.. మళ్ళీ సర్జరీ.. అందుకే.. యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు వైరల్..

గతంలో ప్రదీప్ కి మొదటి సినిమా షూటింగ్ లో కాలికి పెద్ద గాయం అయింది.

Pradeep Machiraju : ఒకసారి సర్జరీ ఫెయిల్ అయింది.. మళ్ళీ సర్జరీ.. అందుకే.. యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు వైరల్..

Anchor Pradeep Machiraju Open up about his Leg Injury and that Difficulties

Updated On : March 30, 2025 / 10:01 AM IST

Pradeep Machiraju : యాంకర్ ప్రదీప్ ఓ పదేళ్ల పాటు ఎన్నో రకాల టీవీ షోలతో బుల్లితెర మెప్పించి స్టార్ అయ్యాడు. సుమ తర్వాత యాంకర్స్ లో ఆ రేంజ్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ప్రదీప్. అయితే కరోనా సమయం నుంచి టీవీ షోలు తగ్గించేసాడు. ఆ తర్వాత హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఒక సినిమా చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరికి కనపడలేదు. ఇటీవలే మళ్ళీ తన రెండో సినిమాతో బయటకు వచ్చాడు.

ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని హీరోగా రెండో సినిమాతో ఏప్రిల్ 11న రాబోతున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ప్రదీప్ యాంకర్ సుమ చాట్ షోకి వచ్చాడు. గతంలో ప్రదీప్ కి మొదటి సినిమా షూటింగ్ లో కాలికి పెద్ద గాయం అయింది. సర్జరీ జరిగి కొన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కరోనా ముందే జరిగింది.

Also Read : NTR – Naga Chaitanya : జపాన్ లో నాగచైతన్యని తెగ పొగిడేసిన ఎన్టీఆర్.. మై డియర్ ఫ్రెండ్ అంటూ.. వీడియో వైరల్..

అయితే అప్పుడే ఒక సర్జరీ జరిగి ఆరు నెలలు రెస్ట్ తీసుకున్నాడు. కాలి గాయం తగ్గకుండానే షోలకు కూడా వచ్చాడు. అప్పట్లో కొన్ని రోజులు షోలకు కుంటుకుంటూనే వచ్చాడు ప్రదీప్. దాంతో ఆ గాయం ఇంకా పెద్దది అయింది. తాజాగా సుమ ఇంటర్వ్యూలో ఈ కాలి గాయం గురించి మాట్లాడాడు ప్రదీప్.

ప్రదీప్ మాట్లాడుతూ.. కాలికి గాయం అవ్వడంతో ఒక సర్జరీ అయింది. అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో సర్జరీ చేసారు. డాక్టర్లు బాగానే కష్టపడ్డారు. నించొని యాంకరింగ్ చేసే జాబ్ కాబట్టి సర్జరీల తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. ఆ సర్జరీ తర్వాత వర్కౌట్స్ కూడా చేయలేకపోయాను. అందుకే గ్యాప్ వచ్చింది. మొత్తానికి రికవరీ అయ్యాక కొన్నాళ్ళు నా ఫిట్నెస్ మీద శ్రద్ద పెట్టాను. ఈ సినిమా కోసం నేను బాగా ఫిట్ గా రెడీ అయి వచ్చా. ఈ సినిమాలో ఎక్కువగా తిరిగే పాత్ర నాది. అందుకే కాలు ఫిట్ గా ఉండాలని రికవరీ అవ్వడానికి చాలా గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు పూర్తిగా రికవరీ అయి వచ్చాను అని తెలిపాడు.

Also Read : Anasuya Bharadwaj : కలర్ ఫుల్ ఫోజులతో అనసూయ ఫొటోలు.. కొత్త షో కోసం..

దీంతో ప్రదీప్ ఎక్కువ రోజులు కనపడకపోవడానికి కారణం ఈ కాలి గాయం అని కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే మొత్తం కోలుకోవడంతో ప్రదీప్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం హేస్తున్నారు. హీరోగా ప్రదీప్ మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా పర్వాలేదనిపించింది. ఇప్పుడు రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా ఉంటుందో చూడాలి.