Udayabhanu : రీ ఎంట్రీలో అదరగొడుతున్న ఉదయభాను.. త్రిబాణధారి బార్బరిక్ సినిమా నుంచి ఉదయభాను ఫస్ట్ లుక్..

తాజాగా నేడు ఈ సినిమా నుంచి ఉదయభాను ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Udayabhanu First Look Released from Tribanadhari Barbarik Movie

Udayabhanu : భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు పాత్రను ఆధారంగా తీసుకుని ప్రస్తుత కథకు, మైథలాజి టచ్ ఇస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ టీజర్ ఈ థియేటర్స్‌లో చూసేయండి.. దేశవ్యాప్తంగా 11 థియేటర్స్ లిస్ట్..

తాజాగా నేడు ఈ సినిమా నుంచి ఉదయభాను ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. నేడు ఉదయభాను పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ సినిమా నుంచి ఉదయభాను ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఉదయభాను ధీమాగా కూర్చుంది. వాకిలి పద్మ అనే పాత్రలో ఈ సినిమాలో కనిపించనుంది ఉదయభాను. ఈ లుక్ చూస్తుంటే ఉదయభానుకు మంచి పాత్రే పడింది అని తెలుస్తుంది.

పిల్లలు పుట్టాక కొన్నాళ్ళు టివి, సినిమాలకు దూరంగా ఉన్న ఉదయభాను ఇటీవలే మళ్ళీ యాక్టివ్ అయింది. ఇటీవల ప్రతినిధి 2 సినిమాలో కనిపించిన ఉదయభాను ఇప్పుడు త్రిబాణధారి బార్బరిక్ లో అదరగొట్టనుంది. సెకండ్ ఇన్నింగ్స్ భారీగానే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ త్రిబాణధారి బార్బరిక్ సినిమాలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.