Udayabhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిన ఉదయభాను.. ఎందుకంటే..?

చాలా గ్యాప్ తర్వాత ఉదయభాను(Udayabhanu) ఇప్పుడు త్రిబాణధారి బార్బరీక్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఉదయభాను విలన్ గా నటిస్తుంది.

Udayabhanu

Udayabhanu : ఉదయభాను యాంకర్ గా స్టార్ డమ్ తెచ్చుకొని అనంతరం పలు సినిమాల్లో కూడా నటించింది. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో సినిమాలకు, టీవీకు బ్రేక్ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఉదయభాను(Udayabhanu) ఇప్పుడు త్రిబాణధారి బార్బరీక్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.

ఈ సినిమాలో ఉదయభాను విలన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉదయభాను ఓ ఆసక్తికర విషయం తెలిపింది.

Also Read : Comedian Rama Chandra : ‘వెంకీ’లో ఫుల్ గా నవ్వించిన కమెడియన్.. ఇప్పుడు పక్షవాతంతో మంచం మీద..

ఉదయభాను నాగబాబు ఆపదమొక్కులవాడు, రానా లీడర్, అల్లు అర్జున్ జులాయి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. స్పెషల్ సాంగ్స్ గురించి ప్రస్తావన రాగా ఉదయభాను ఇంకో స్పెషల్ సాంగ్ వదిలేసుకున్నాను అని తెలిపింది.

ఉదయభాను మాట్లాడుతూ.. జులాయి తర్వాత త్రివిక్రమ్ గారిది ఇంకో సాంగ్ చేయను అని చెప్పాను. అత్తారింటికి దారేది సినిమాలో సాంగ్ కి నన్ను అడిగారు. నేను కొంచెం భయపడ్డాను. అది పార్టీ సాంగ్, చాలా మంది ఉంటారు, అంతమంది స్టార్స్ మధ్యలో నన్ను ఇగ్నోర్ చేస్తారేమో అని అనుకున్నాను. అప్పటికి బాగా కన్విన్స్ చేసారు కానీ నేను ఒప్పుకోలేదు. ఆ సాంగ్ చేయనందుకు నేను బాధపడలేదు అని తెలిపింది.

Also See : Varsha Bollamma : వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ వర్కింగ్ స్టిల్స్..

ఉదయభాను అత్తారింటికి దారేది సినిమాలో వదులుకున్న సాంగ్ ఇదే. ఉదయభాను ఛాన్స్ మిస్ చేసుకోవడంతో ఈ సాంగ్ కోసం హంసా నందిని ని తీసుకున్నారు.

ఉదయభాను జులాయిలో అల్లు అర్జున్ తో చేసిన సాంగ్ ఇదే..