Karthi : కార్తీకి కోటి రూపాయలు ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. థ్యాంక్స్ చెప్పిన విశాల్

ఉదయనిధి స్టాలిన్ రూ.కోటి చెక్ కార్తీకి ఇచ్చారు. విశాల్ అందుకు థ్యాంక్స్ చెప్పారు..ఎందుకోసమో తెలుసా?

Karthi

Karthi : తమిళనాడులో నడిగర్ సంఘం భవన నిర్మాణం నిధులు లేక చివరి దశలో నిలిచిపోయింది. దీనిని ఎలాగైనా పూర్తి చేయాలని హీరో విశాల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం ఆగిపోయి 3 సంవత్సరాలు అవుతోంది. ఆలస్యానికి తోడు బడ్జెట్ కూడా పెరిగిపోయింది.  అయితే తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నడిగర్ భవన నిర్మానానికి రూ. కోటి రూపాయలు నిధులు మంజూరు చేసారు.

Love At 65 Trailer : 65 ఏళ్ళ వయసులో రాజేంద్రప్రసాద్‌తో జయప్రద ప్రేమ.. ట్రైలర్ చూశారా?

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కొత్త భవన నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయింది. ఎలాగైనా ఈ భవనం పూర్తి చేయాలని విశాల్ చాలా కష్ట పడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని కూడా విశాల్ ఆ మధ్య స్పష్టం చేశారు. నిర్మాణం కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని చెప్పారు. ఇక భవన నిర్మాణం కోసం బ్యాంకు నుండి లోన్ తీసుకునేందుకు నటీనటుల సంఘం తీర్మానం చేసుకున్న సమయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ.కోటి రూపాయలు మంజూరు చేస్తూ ట్రెజరర్ కార్తీకి చెక్ అందజేశారు. దీనిపై నడిగర్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఉదయనిధి స్టాలిన్‌కి కృతజ్ఞతలు చెప్పింది.

Amaran Glimpse : శివకార్తికేయన్ ‘అమరన్’ టైటిల్ గ్లింప్స్ చూశారా? కశ్మీర్ నేపథ్యంలో..

హీరో విశాల్ ఉదయనిధి స్టాలిన్‌కి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కార్తీకి చెక్ అందిస్తున్న ఫోటోను షేర్ చేసారు. ‘మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవన నిర్మాణ పనులకు ముందుకు వచ్చినందుకు స్నేహితుడు, నిర్మాత, నటుడుగానే కాకుండా తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనికి కృతజ్ఞతలు.. గాడ్ బ్లెస్’.. అంటూ విశాల్ పోస్టు చేసారు. నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా కార్తీ కొనసాగుతున్నారు.